ప్రైవేట్ పార్ట్స్ లో బంగారు, లేడీఎస్ ప్లాన్, కస్టమ్స్ అధికారులతో ?, ఎయిర్ పోర్టులో !
బెంగళూరు: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి అక్రమంగా కోట్లాది రూ. విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. మలేషియా, కువైట్, కొలంబో నుంచి వచ్చిన ప్రయాణికులను సోదాలు చేసి తనిఖీ చేయగా భారీగా బంగారం బయటపడింది. దొంగలు చాపకిందనీరులా స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించారు.
అయితే కస్టమ్స్ అధికారులు అంతకంటే చాకచక్యంగా ప్లాన్ చేసి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను గుర్తించడంతో స్మగ్లర్లు బిత్తరపోయారు. దొంగలకు తెలివి ఎక్కువ అయితే చట్టం చదువుకున్న అధికారులు అంతకంటే తెలివిగా ప్రవర్తించారు. ఎలాగైన స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించిన దొంగలను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టేశారు.

కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహిళ బ్లౌజ్ పీస్‌లో బంగారం పేస్ట్‌ను అక్రమంగా తరలిస్తుండగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. బ్లౌజ్ పీస్ లో రూ 17 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు పేస్ట్ ను అతికించారని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళ డ్రై ఫ్రూట్ పాకెట్‌లో సుమారు 15 లక్షల విలువైన బంగారు ముక్కల దాచి పెట్టుకుని రావడంతో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా డ్రైఫ్రూట్స్ బాక్స్ లో బంగారు ముక్కలు కనిపించాయి. మలద్వారంలో (ప్రైవేట్ పార్ట్)లో అర్ద కేజీ బంగారం దాచిపెట్టుకుని స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించిన మహిళ అధికారులకు చిక్కిపోయింది.

మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ మహిళ మలద్వారంలో 30 లక్షల విలువైన 578 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గమనించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications