గొంతు, మర్మాంగం కత్తిరించి వ్యాపారి దారుణ హత్య, అక్రమ సంబంధం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో జరిగింది. మైసూరు జిల్లాలోని హుణసూరులోని రంగనాథ లేఔట్ లో నివాసం ఉంటున్న బెళ్లుళ్లి (వెళుళ్లి) మహేష్ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు.

మహేష్ హుణసూరు, మైసూరులో వెళ్లుళ్లి వ్యాపారం చేస్తున్నాడు. ఇతన్ని అందరూ బెళ్లుళ్లి మహేష్ అని పిలుస్తుంటారు. గురువారం ఉదయం ఇంటి నుంచి వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగిరాలేదు.

A mam murdered in Hunasuru near Mysuru

వ్యాపార విషయంలో రాత్రి ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు భావించారు. అయితే శుక్రవారం రంగనాథ లేఔట్ లోని ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో మహేష్ శవమై కనిపించాడు. మహేష్ గొంత, మర్మాంగం పూర్తిగా కత్తిరించి హత్య చేసిన నిందితులు పరారైనారు. అక్రమ సంబంధం కారణంగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
45 year old mam murdered in Hunasuru near Mysuru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి