వృద్దుల మీద ఓ కిరాతకుడి దాడి (వీడియో)
చత్తిస్ గడ్: షాప్ లో ఉన్న వృద్ద దంపతుల మీద ఓ కిరాతకుడు ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. ఎదురు తిరగలేని ఆ దంపతుల మీద ఇష్టం వచ్చినట్లు చెయ్యి చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల వయస్సు ఉన్నవారని కూడా అతను ఆలోచించలేదు.
చత్తిస్ గడ్ లోని ఓ షాపింగ్ మాల్ లోని ఒక దుకాణంలోకి దంపతులు వెళ్లారు. వారికి కావలసిన వస్తువులు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లాడు. మొదట భార్య చెంప చెల్లుమనిపించాడు. ఆమెపై పిడుగుద్దులతో దాడి చేశాడు.
అంతటితో ఆగకుండా వృద్దుడి మీద దాడి చేశాడు. తన భర్తకు కొట్టరాదని ఆమె వేడుకుంటున్నా అతను కనికరించలేదు. ఆయన మీద పదేపదే దాడి చేశాడు. షాప్ పై వేలాడదీసిన వస్తువులు లాగి విసిరేశాడు.
తన భార్య మీద దాడి చేస్తున్నా ఆయన నిస్సహాయ స్థితిలో అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించించారు. అదే సమయంలో కిరాతకుడు మళ్లి దాడి చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
పోలీసులు సీసీ కెమెరాల క్లిప్పింగ్ లు స్వాధీనం చేసుకున్నారు. దంపతులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కిరాతకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దాడికి కచ్చితమైన కారణాలు తెలియం లేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications