లేడీ ఎస్ఐకి ఫోన్ చేసి రాత్రి లాడ్జ్ రా ?,నీ రేటు ఎంత ?, నేను ఎంత మగాడినో నువ్వే చూస్తువురా,రూ. లక్ష!
బెంగళూరు: మహిళా పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)కి ఫోన్ చేసిన కామాంధుడు ఏయ్ రాత్రికి లాడ్జ్ కు వస్తావా ? రాత్రికి నీ రేటు ఎంత ? రా ఎంజాయ్ చేద్దాం, నేను ఎంత మగాడో నువ్వే చూస్తువు రా అన్నాడు. అంతే కాకుండా 26 మంది మహిళా హోం గార్డుల నగ్న చిత్రాలను మహిళా ఎస్ఐ మొబైల్ కుం పంపించిన అతను నువ్వే చూడూ, నేను ఎలా ఎంజాయ్ చేశానో ? లేట్ చెయ్యద్దు, వెంటనే రా... !, రూ. లక్ష ఇవ్వకుంటే ఈ ఫోటోలు అందరికీ పంపిస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు గురి చేసిన ఘటన బెంగళూరు నగరంలో, పోలీసు శాఖలో కలకలం రేపింది.

బెంగళూరులో మహిళా ఎస్ఐ
బెంగళూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో రమ్యకృష్ణ (పేరు మార్చడం జరిగింది) సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసిన నీచుడు తనతో అసభ్యంగా మాట్లాడాడని, మహిళా హోం గాడ్స్ నగ్న చిత్రాలు పంపించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే రూ. 1 లక్ష ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని మహిళా ఎస్ఐ రమ్యకృష్ణ పై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

నీ రేటు ఎంత ?
రాత్రి సుమారు 9. 50 గంటల సమయంలో విధులు ముగించుకున్న ఎస్ఐ రమ్యకృష్ణ విద్యారణ్యపుర సమీపంలోని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎస్ఐ రమ్యకృష్ణ మొబైల్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసిన ఎస్ఐ రమ్యకృష్ణతో ఏయ్ రాత్రికి లాడ్జ్ కు వస్తావా ? రాత్రికి నీ రేటు ఎంత ? ఎంత డబ్బులు ఇవ్వడానికైనా నేను సిద్దంగా ఉన్నాను అని అడగడంతో ఆమె షాక్ కు గురైయ్యింది.

రేయ్ నేను ఎవరో తెలుసా ?
వెంటనే తేరుకున్న ఎస్ఐ రమ్యకృష్ణ రేయ్ నేను ఎవరో తెలుసా ? ఎవరికి ఫోన్ చేసి ఏమి మాట్లాడుతున్నావ్ ?, అసలు నా ఫోన్ నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు ? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఆ సమయంలో నువ్వు లేడీ ఎస్ఐ అని నాకు తెలుసు, నీ మొబైల్ ఫోన్ నెంబర్ మీ పోలీస్ స్టేషన్ లో పని చేసే మహిళా హోం గాడ్స్ ఇచ్చారు అని ఆ కామాంధుడు సమాధానం ఇచ్చాడు.

26 మంది మహిళా హోం గాడ్స్ నగ్న ఫోటోలు
రాత్రి పొద్దుపోయిన సమయంలో కామాంధుడు రెచ్చిపోవడంతో మహిళా ఎస్ఐ రమ్యకృష్ణ ఫోన్ కాల్ కట్ చేశారు. వెంటనే ఆ వ్యక్తి ఎస్ఐ రమ్యకృష్ణ మొబైల్ కు 26 మంది మహిళా హోమ్ గాడ్స్ నగ్న చిత్రాలు పంపించాడు. మొబైల్ లో తనతో పాటు హోమ్ గాడ్స్ గా పని చేస్తున్న మహిళల నగ్న ఫోటోలు చూసిన ఎస్ఐ రమ్యకృష్ణ షాక్ కు గురైయ్యింది.

నేను ఎంత మగాడో చూస్తువు రా !
నగ్న ఫోటోలు పంపించిన తరువాత ఆ కామాంధుడు మళ్లీ మహిళా ఎస్ఐ రమ్యకృష్ణకు ఫోన్ చేశాడు. నేను పంపించిన నగ్న ఫోటోలు చూశావా ? ఎలాగుంది, ఇప్పటికైనా తెలిసిందా నేను ఎంత బలమైన మగాడో అన్నాడు. ఒక్క రాత్రికి లాడ్జ్ కు రా, నీకు కావలసినంత డబ్బులు ఇస్తా, స్వర్గం చూపిస్తా, నేను ఎంత మగాడినో నువ్వే చెప్పుదువు కాని అంటూ అసభ్యంగా మాట్లాడాడు.

రూ. 1 లక్ష ఇవ్వాలని బ్లాక్ మెయిల్ !
మీ మహిళా హోమ్ గాడ్స్ నగ్న ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే వెంటనే నాకు రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని, లేదంటే మీ పని ఫినిష్ అని బెదిరించాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో మహిళా ఎస్ఐ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసి మొబైల్ లో వచ్చిన నగ్న వీడియోలు క్లిప్పింగ్స్ ఇచ్చింది. మహిళా ఎస్ఐకే ఇలాంటి వేధింపులు రావడంతో సీరియస్ అయిన పోలీసు అధికారులు కామాంధుడి కోసం గాలిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications