Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొదటి భార్య ఎస్కేప్, రెండో భార్య టార్చర్, దేవుడా నా వల్ల కాదు, టిక్ టాక్ లో వీడియో తీసి ఆత్మహత్య !

బెంగళూరు: మొదటి భార్య వెళ్లి పోయింది. ఉన్న రెండో భార్య ప్రతినిత్యం ఇంటిలో పదేపదే టార్చర్ పెడుతుందనే ఆవేదనతో జీవితంపై విరక్తి చెందిన భర్త టిక్ టాక్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. నా రెండో భార్య వేదింపుతలతో నేను తట్టుకోలేకపోతున్నానని ఆరోపిస్తూ ఆ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో భార్య వేదింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 మొదటి భార్య ఎస్కేప్

మొదటి భార్య ఎస్కేప్

కర్ణాటకలోని దావణగెరె సమీపంలోని మాగనహళ్ళి గ్రామంలో నాగరాజ్ అలియాస్ రాజు (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాగరాజ్ కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మొదట భార్య, కుమార్తెతో సంతోషంగా ఉన్న నాగరాజ్ ఇంటిలో సమస్యలు మొదలైనాయి. తరువాత భర్త నాగరాజ్ ను వదిలేసిన అతని భార్య వెళ్లిపోయింది.

రెండో భార్య ఎంట్రీ

రెండో భార్య ఎంట్రీ

భార్య వెళ్లి పోవడంతో నాగరాజ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇంత కాలం రెండో భార్యతో నాగరాజ్ కలిసి ఉంటున్నాడు. రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్య వెళ్లిపోతే పోయింది, రెండో భార్యతో తాను సంతోషంగా, సుఖంగా ఉంటున్నానని ఇంతకాలం నాగరాజ్ అతని స్నేహితులకు చెబుతూ వస్తున్నాడని సమాచారం.

 గొడవలతో ఆవేదన

గొడవలతో ఆవేదన

ఇటీవల కాలంలో నాగరాజ్ రెండో భార్యతో గొడవలు పడుతున్నాడని తెలిసింది. నాగరాజ్ ఇంటిలో గొడవలు జరగడం, కుటుంబ పెద్దలు, గ్రామస్తులు పంచాయితీలు చెయ్యడం జరుగుతోందని తెలిసింది. నిత్యం ఇంటిలో గొడవలు ఎక్కువ కావడంతో నాగరాజ్ విసిగిపోయాడని సమాచారం.

 భర్తను వదిలేసిన రెండో భార్య

భర్తను వదిలేసిన రెండో భార్య

నెల రోజుల క్రితం ఇంటిలో గొడవలు ఎక్కువ కావడంతో నాగరాజ్ రెండో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మొదటి భార్య, రెండో భార్య విడిచి వెళ్లిపోవడంతో నాగరాజ్ అయోమయానికి గురైనాడు. రెండో భార్య వెళ్లిపోయిన తరువాత మద్యంకు బానిస అయిన నాగరాజ్ రోజూ ఎక్కువగా టిక్ టాక్ లో కాలం గడుపుతున్నాడు.

 మూడు రోజుల క్రితం ఆత్మహత్య

మూడు రోజుల క్రితం ఆత్మహత్య

తన రెండో భార్య తనను ఎక్కువ టార్చర్ పెట్టిందని, పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమె వేదింపుల కారణంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నాగరాజ్ మూడు రోజుల క్రితం టిక్ టాక్ లో వీడియో తీశాడు. వీడియో అప్ లోడ్ చేసిన నాగరాజ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజ్ అప్ లోడ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. మూడు రోజుల తరువాత నాగరాజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నాగరాజ్ ఇద్దరు భార్యలకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+