3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..
శరీరంలో కిడ్నీ ఫంక్షనింగ్ ఇంపార్టెంట్.. అవును శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసి.. మంచిని అందజేస్తోంది. సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. ఒకటి పాడయిన సరే.. మరొకటితో లైఫ్ లీడ్ చేయొచ్చు.. కొందరికీ రెండు పాడవడంతో.. డయాలసిస్ తప్పనిసరి అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం డయాలిసిస్ ఉచితంగానే అందజేస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒకరికీ ఏకంగా మూడు కిడ్నీలు ఉన్నాయి. స్కాన్ చేసిన వైద్యులు.. ఆశ్చర్యపోయారు. మరోసారి స్కాన్ చేసిన అంతే వచ్చింది.

వ్యాపారికి మూడు కిడ్నీలు
ఉత్తరప్రదేశ్‌లో గల కాన్ఫూర్‌కు చెందిన వ్యాపారి సుశీల్ గుప్తాకు మూడు కిడ్నీలు ఉన్నాయి. మూడు కిడ్నీలు ఉన్నప్పటికీ సుశీల్ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. 2020లో తొలిసారిగా పిత్తాశయం ఆపరేషన్ కోసం అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి వచ్చిందట.. అప్పుడు విషయం బయటపడింది. మూడు కిడ్నీలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. వైద్యులు మళ్లీ అల్ట్రాసౌండ్ చేయించిన అంతే సంగతి.. శరీరంలో మూడు కిడ్నీలు సాధారణంగా పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు.

ఎడమవైపు రెండు కిడ్నీలు
ఎడమవైపు రెండు కిడ్నీలు ఉండగా, కుడివైపు ఒక కిడ్నీ ఉందని వ్యాపారి సుశీల్ వివరించారు. నారాయణ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ రవికుమార్ ఏం జరిగిందో తెలియజేశారు. కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెండు కిడ్నీలు ఒక వైపునకు అభివృద్ధి చెందాయని, అందుకే అతనికి మూడు కిడ్నీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు అయితే ఓకే.. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కానీ జాగ్రత్తలు తప్పనిసరి
సుశీల్ ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. ఇలాంటివారికి ఏదైనా ప్రమాదం జరిగితే కిడ్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి. అలాంటివారు మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి క్రీడలు ఆడకూడదని తెలిపారు. అలా ఆడితే ప్రమాదం ఉందని అంటున్నారు. రెండు కిడ్నీలు ఓకేసారి దెబ్బతినే అవకాశం ఉందట.. సో ఇన్నాళ్లు మూడు కిడ్నీలు పనిచేసి... ఆ తర్వాత రెండు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పవట. కానీ మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు రావడం రేర్ అని వైద్యులే చెబుతున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications