పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!
పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపివేశాయని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మూడు చిరుత పులులను చంపివేశాడు. దాడి చేసిన కుక్కల శవాలపై విష పదార్థం చల్లాడు. దీంతో చనిపోయిన కుక్కను తిన్న మూడు చిరుత పులులు మృత్యువాత పడ్డాయి.
మనిషి విచక్షణ కోల్పోతే ఎలా ప్రవర్తిస్తాడో అంతుపట్టని పరిస్థితి నెలకొంటుంది. అది తోటి మనుష్యులైన లేదా నోరు లేని జంతువులని కూడ చూడకుండా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలోనే తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలపై చిరుత పులులు దాడి చేశాయని వాటిని విషం పెట్టి చంపాడు. హరిద్వార్‌కు చెందిన సుఖ్‌పాల్ అనే వ్యక్తి రెండు కుక్కలను పెంచుకున్నాడు. అయితే వాటిపై రాజాజీ నేషనల్ పార్క్‌లో ఉన్న చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లాయి. ఇలా రెండు కుక్కలను కూడ చిరుతలు ఎత్తుకుపోయాయి.

దీంతో చిరుతలపై కక్ష పెంచుకున్న సుఖ్‌పాల్ వాటిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చనిపోయిన కుక్కపై నర్సరీల్లో వాడే పురుగుమందులను ఎక్కువమోతాదులో చనిపోయిన కుక్కపై పోసి, దాన్ని చిరుతలు ఉండే ప్రాంతంలో పడేశాడు.దీంతో చనిపోయిన కుక్కను తిన్న మూడు చిరుతలు చనిపోయాయి. అయితే చిరుత మరణంపై పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు విషం తినడంతో చనిపోయాయని నిర్ధారించారు. దీంతో విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సుఖ్‌పాల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు సుఖ్‌పాల్ భార్య ఫారెస్ట్ నర్సరీలోని తాత్కలిక ఉద్యోగిగా చేస్తోందని పోలీసులు తెలిపారు..కేసు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడడంతో కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications