పగ: సొంత అన్న కుమార్తెను కొడవలితో నరికి చంపిన తమ్ముడు, పాన్ పరాగ్, వైరల్!

బెంగళూరు: కుటుంబ గొడవలు, ఆస్తుల పంపకాల విషయంలో అన్నతో గొడవపడి పగ పెంచుకున్న తమ్ముడు చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి సొంత చిన్నాన చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది.

బెళగావి జిల్లా గోకాక్ తాలుకా, కౌజలగి గ్రామంలో మల్లప్ప హోసమని నివాసం ఉంటున్నాడు. ఇతను ఆస్తుల పంపకం, కుటుంబ గొడవల కారణంగా సొంత అన్న మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అన్నను, అతని కుటుంబ సభ్యులను హత్య చెయ్యాలని వేచి చూస్తున్నాడు.

A man murder his brothers daughter near Belgavi in Karnataka

మల్లప్ప హోసమని అన్న కుమార్తె ప్రేమ అనే చిన్నారి ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. మల్లప్ప అన్న పనిపై పోలం దగ్గరకు వెళ్లాడు. సొంత అన్న కుమార్తె ఆడుకుంటున్న విషయం మల్లప్ప హోసమని గుర్తించాడు.

పగతో రగిలిపోయిన మల్లప్ప చేతిలో ఉన్న కొడవలి తీసుకుని అన్న కుమార్తె ప్రేమ మెడ మీద ఒక్కవేటు వేశాడు. అంతే ప్రేమ సంఘటనా స్థలంలో ప్రాణాలువిడిచింది. పాన్ పరాగ్, తాంబూళం వేసుకున్న మల్లప్ప గ్రామంలో ధీమాగా తిరిగాడు.

అన్న కూతురు ప్రేమను చంపేశా, వాడు (అన్న) చిక్కితే ఇప్పుడే చంపేస్తా అంటూ గ్రాయంలో తిరిగాడు. ఆ సమయంలో మల్లప్ప దర్జాగా తిరుగుతూ నేను హత్య చేశాను అని చెబుతున్న సమయంలో తీసిని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు మల్లప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+