Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Google: లోపాలు చెప్పి కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి..

ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు.. అందులో తప్పుందని మనం చెబితే వారు ఏం చేస్తారు.. కొందరైతే తప్పును సరిదిద్దుతారు. మరికొందరైతే ఏ.. తప్పే జరగలేదని బుకాయిస్తారు. ఇంకొందరైతే దా నువ్వు చేయి.. పని చేస్తే తెలుస్తుంది నీకు అని అంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం తప్పును ఎత్తి చూపినందకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చింది. అదేదో చిన్న కంపెనీ కాదు.. ప్రపంచంలోనే పేరు మోసిన కంపెనీ గూగుల్(Google).

అల్ఫాబెట్ ఇంక్ కు చెందిన గూగుల్ లో భద్రతా లోపాలున్నాయని ఓ వ్యక్తి గుర్తించాడు. అవి ఏం లోపాలో కూడా గుర్తించి కంపెనీకి వివరించాడు. దీంతో అతను భారీ నగదు బహుమతి పొందాడు. ఇంతకీ అతను ఎవరో చెప్పలేదు కదూ.. అతను మన భారతీయుడే.. దక్షణాది రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగడలో శ్రీరామ్ అనే వ్యక్తి జన్మించాడు. అతను చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో గూగుల్ లో లోపాలున్నాయని చెప్పి రూ.1 కోటి గెలుపొందాడు.

A man named Sriram won crores of rupees by saying that Google had security flaws

గూగుల్ లో లోపాలు గుర్తించేందుకు వర్నరబిలిటీ రివార్డ్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తోంటుంది. శ్రీరామ్ ఈ వర్నరబిలిటీ రివార్డ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అతను రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలించాడు. గూగల్ సెక్యూరిటీ లోపాలను గుర్తించినందుకు ఆ కంపెనీ శ్రీరామ్ కు 1,35, 979 డాలర్లను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇండియని కరెన్సీ ప్రకారం శ్రీరామ్ రూ.1,12,86,257 గెలుచుకున్నాడు.

శ్రీరామ్ స్క్వాడ్రన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీని రన్ చేస్తున్నాడు. కెనడాలో రిజిస్టర్ అయిన శ్రీరామ్ కంపెనీ స్క్వాడ్రన్ ల్యాబ్స్ సైబర్ దాడుల నుంచి ఎన్నో కంపెనీలను కాపాడుతోన్నట్లు చెబుతున్నారు. శ్రీరామ్ ఇంతకు ముందు కూడా గూగుల్ ఇతర సేవలలో భద్రతా లోపాలను గుర్తించారు. శ్రీరామ్ అతని స్నేహితుడు చెన్నైకి చెందిన శివనేష్ అశోక్ 4 నివేదికలు పంపారు. వీటిలో మూడింటికి బహుమతులు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+