విటుడిలోని మానవత్వం... ! వ్యభిచార కూపం నుంచి ఆమెకు విముక్తి..!! ఎలా..?

న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాజంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగిపోతుంటాయి. మరి కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగినా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇలాంటి అనుకోని సంఘటనల వల్ల ఒక్కోసారి వ్యక్తుల జీవితాలు సమూలంగా మారి పోతుంటాయి. అర్థం చేసుకునే తత్వం, తెగింపు ఉంటే ఎంతటి మార్పులకైనా కేంద్ర బిందువు కావొచ్చని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉదంతం రుజువు చేసింది. ఓ భాగ్యురాలితో విధి ఆడిన వింత నాటకానికి అతడు నాటకీయ ముగింపు పలికాడు. కథ సుఖాంతమవడంతో యువతి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

వెళ్లింది వేశ్య వద్దకు..! చేసింది మాత్రం ఉన్నతమైన పని..!!

వెళ్లింది వేశ్య వద్దకు..! చేసింది మాత్రం ఉన్నతమైన పని..!!

ఏ స్త్రీ వ్యభిచారం చేయాలనుకోదు. అలాగే వేశ్య వృత్తి కొనసాగించాలని కూడా ఎవరు అనుకోరు. ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ వృత్తిలోకి తోస్తారు లేదా ఏ తోడు లేక జీవనం కోసం ఏమి చేయాలో తెలియక ఇందులోకి వస్తారు. ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది. అయితే వారి వద్దకు వెళ్లే కస్టమర్లు సుఖాన్ని కోరుకుంటారే తప్ప వారి బాధల్ని పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఎలాగైనా ఆమెను ఆ ఊబినుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం ఇచ్చారు. చివరకు ఆమెకు విముక్తి కల్పించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరిగింది.

 దేవుడి రూపంలో వచ్చిన విటుడు..!!

దేవుడి రూపంలో వచ్చిన విటుడు..!!

మోసపోయి వేశ్యగా మారిన వైనం..! దేవుడి రూపంలో వచ్చిన విటుడు..!!
కోల్‌కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. అంతలోనే ఆమెకు పరిచయమైన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు నమ్మి జూన్‌ 8న ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తుందనే ఆశతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక తెలిసింది సదరు మహిళ ఆమెను మోసం చేసిందని.

వేశ్య దగ్గరికి వెళ్లి ఇంత గొప్ప పని చేస్తారా..! అది కొందరికే సాద్యం..!!

వేశ్య దగ్గరికి వెళ్లి ఇంత గొప్ప పని చేస్తారా..! అది కొందరికే సాద్యం..!!

ఓ వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆమె.. రెండు నెలలపాటు నరకం చూసింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్‌ తీసుకొని బందించారు. చిత్రహింసలకు గురిచేశారు. వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె వద్దకు కోల్‌కతా కస్టమర్‌ వచ్చాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

 కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు..! కాపాడుకున్న తోబుట్టువు..!!

కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు..! కాపాడుకున్న తోబుట్టువు..!!

అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ రావడంతో మహిళ సోదరుడు ఢిల్లీకి వెళ్లి అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని... నిర్థారించుకోవడానికి కస్టమర్‌గా వేశ్య గృహానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్‌ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. చేసింది తప్పే అయినా ఆ కస్టమర్‌ ఓ మహిళను రక్షించి మంచి పని చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+