'లక్ష లైకులొచ్చాయి.. ఆ వెంటనే 25వేల ఫైన్'
అహ్మదాబాద్ : పాపులారిటీకైనా.. పబ్లిసిటీకైనా.. సోషల్ మీడియాను మించిన పారామీటర్ లేదన్నట్లుగా తయారైంది పరిస్థితి. జనాలను ఆకట్టుకుంటే చాలు.. విషయమేదైనా క్షణాల్లో వైరల్ గా మారిపోవడం.. హాట్ టాపిక్ అంటూ వార్తల్లోకి ఎక్కేయడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది.
ఇదే తరహాలో.. పాపులారిటీ కోసం చేశాడో.. మరేమో తెలియదు గానీ.. ఓ కోబ్రాను గాజు సీసాలో బంధించి దానితో సెల్ఫీ దిగాడు వడోదరాకు చెందిన బిల్డర్ యషేష్ బరోత్. అనంతరం 'కోబ్రా ఫర్ 1000' అనే ట్యాగ్ లైన్ ను జతచేసి ఆ సెల్ఫీని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో కుప్పలు తెప్పలుగా లైక్స్, కామెంట్స్ వచ్చిపడ్డాయి. ఏకంగా లక్ష హిట్స్ ను సొంతం చేసుకుంది ఆ ఫోటో.
అయితే.. ఆ పబ్లిసిటీయే ఇంకో చిక్కునూ తెచ్చి పడింది. విషయం కాస్త ఆ నోటా.. ఈ నోటా అటవీ శాఖ ద్రుష్టికి వెళ్లింది. వైల్డ్ యాక్టివిస్ట్ ఒకరు యపేష్ బరోత్ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేశారు. స్వేచ్చా జీవిని బంధించి సెల్ఫీ ఫోటోలకు పోజులివ్వడాన్ని తప్పుబట్టిన ఆయన.. అనంతరం స్థానిక అటవీ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో స్పందించిన అధికారులు యషేష్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి 25వేల జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications