Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Faridabad: కిడ్నీ అమ్మకానికి ఉంది.. ఆత్మహుతికి రాష్ట్రపతి, పీఎం, సీఎం రావాలి.. భార్య బాధితుడి ఆవేదన..

విడాకుల కోసం భార్య రూ.10 లక్షలు అడిగితే భర్త ఏం చేశాడో తెలుసా..!

హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నాడు. దానిపై ఫ్లెక్సీలో అతని భార్య, బావమరిది, అత్త ఫొటోలు ఉన్నాయి. కిడ్నీ అమ్మకానికి ఉంది, ఆమరణ నిరాహార దీక్ష రాసి ఉంది. మార్చి 21న ఆత్మాహుతి కార్యక్రమం అని రాశారు. ఫోన్ నంబర్ నుంచి అడ్రస్ కూడా రాసి ఉంది. ఈ వ్యక్తితో పాటు ఫ్లెక్సీని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ బ్యానర్ పట్టుకుని ఫరీదాబాద్ లో తిరుగుతున్న వ్యక్తి పేరు సంజీవ్.

సంజీవ్ స్వస్థలం బీహార్ రాజధాని పట్నా. అతనికి 6 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది. అతని భార్య, అత్తమామ, బావమరిది ఇబ్బంది పెడుతున్నారు. విడాకులు కావాలని తన భార్య ఒత్తిడి చేస్తోందని సంజీవ్ చెప్పాడు. విడాకులు కావాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని వాపోయాడు. తన వద్ద రూ.10 లక్షలు లేవని.. కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడినట్లు చెప్పాడు. కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బులతో తన భార్యకు పది లక్షల రూపాయలు ఇచ్చి విడాకులు తీసుకుంటానని చెప్పారు.

A man put his kidney for sale to pay his wife and aunty
సంజీవ్ పై అతనిపై భార్య మరియు అత్తమామలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడు. వరకట్న వేధింపుల కేసు 6 ఏళ్లుగా కేసు నడుస్తుండగా.. విడాకులతోపాటు రూ.10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేస్తోందన్నారు. మార్చి 21 నా కిడ్నీ అమ్మి అత్తమామలకు డబ్బు ఇస్తానని చెప్పాడు. లేకుంటే అదే రోజు ఆత్మాహుతి చేసుకుంటానని తెలిపాడు.

ఆత్మాహుతి , PM, CM, రాష్ట్రపతి రావాలని కోరాడు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా ప్రజలందరినీ కూడా ఈ రోజుకు ఆహ్వానిస్తున్నాని చెప్పాడు. న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చాలా సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు పేర్కొన్నాడు. తన భార్య 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె అత్తమామలు ఆమెకు అబార్షన్ చేయించారని చెప్పాడు. తన భార్య తన వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు వివరించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+