దారుణం: ఏడేళ్ళ కూతురిపై లైంగిక వేధింపులు, బాధితురాలిలా...
ఏడేళ్ళ కూతురి ముందు వికృత చేష్టలకు పాల్పడిన తండ్రిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు బానిసగా మారి ఆ దుర్మార్గానికి పాల్పడ్డారు.
మైసూర్: ఏడేళ్ళ కూతురి ముందు వికృత చేష్టలకు పాల్పడిన తండ్రిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు బానిసగా మారి ఆ దుర్మార్గానికి పాల్పడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేగింది. పెరియపట్టణానికి చెందిన దంపతులకు తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది.వారికి ఏడేళ్ళ పాప ఉంది.

కొద్దికాలంగా వ్యసనాలకు బానిసైన ఆ తండ్రి ఆదివారం నాడు తన కూతురి ముందు దుస్తులు లేకుండా నిలబడి అసభ్యవీడియోలు చూపించే ప్రయత్నం చేశారు.
అయితే తండ్రి ప్రవర్తనతో బాలిక భయపడింది. వెంటనే పెద్దగా కేకలు వేసింది. కూతురి అరుపులు విన్న ఆ తల్లి లోపలకి వచ్చి అవాక్కైంది. వెంటనే బిడ్డను తీసుకొని బయటకు వచ్చింది.
ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొన్న కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications