ఫ్రెండ్ అక్కతో అక్రమ సంబంధం, ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తే ?

బార్ లో కుర్చుని అందరూ జల్సాగా మద్యం సేవిస్తున్నారు. చాలా మంది ఫుల్ గా లిక్కర్ కిక్కులో స్వర్గంలో తేలుతున్నారు. అదే బార్‌లో కూర్చుని మద్యం సేవించిన వ్యక్తిని కత్తితో వేరే వ్యక్తి పొడిచి దారుణంగా హత్య చేయడంతో అంత వరకు మద్యం మత్తులో పిచ్చపాటిగా కబుర్లు చెబుతున్న వాళ్లు హడలిపోయారు. హత్య వెనుక అక్రమ సంబంధమే కారణమని పోలీసు అధికారులు అంటున్నారు.

ప్రైవేట్ ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపులే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

సెప్టెంబర్ 21వ తేదీన హనుమంత అలియాస్ కుమార్ (30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దావణగెరె నగరంలోని కేటీజే నగర్ నిటువల్లి మెయిన్ రోడ్డులోని ప్రకాశ్ బార్ లో కూర్చున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన గౌతమ్ పవార్ అలియాస్ గౌతమ్ అనే వ్యక్తి కత్తితో హనుమంతను పొడిచాడు. ఈ మేరకు కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

A man who had an illicit relationship with a friend s sister was planned and killed

హత్య కేసును విచారించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హనుమంత అలియాస్ కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ క్లూతో పోలీసులు హత్యకు గురైన హనుమంత స్నేహితులను విచారించారు. హత్యకు గురైన హనుమంత నిందితుడు గౌతమ్ సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెలుగులోకి వచ్చింది. ఇదే సందర్బంలో ఆమె కొన్ని ప్రైవేట్ ఫోటోలను వైరల్ చేస్తానని హనుమంత ఆమెను బెదిరించాడని తేలింది.

ప్రైవేట్ ఫోటోలను వైరల్ చేయవద్దని నిందితుడు గౌతమ్ చాలాసార్లు అతని స్నేహితుడు హనుమంతను అభ్యర్థించాడని పోలీసులు అన్నారు. అయినా కూడా హనుమంత వినలేదని పోలీసులు అన్నారు. తరువాత హనుమంత, గౌతమ్ ల మధ్య అనేకసార్లు గొడవ జరిగిందని, రెండు సార్లు ఇద్దరూ కొట్టుకున్నారని పోలీసులు చెప్పారు. అందుకే హనుమంతను కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిందితుడు గౌతమ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+