ప్రియుడిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన కొత్త పెళ్లికూతురు, ఆషాడమాసంలో ?
వివాహిత మహిళ తన మాజీ ప్రియుడిని కౌగిలించుకుని వేల్ తో అతన్నికట్టుకుని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చింతామణి తాలూకాలోని ఎం. ముద్దాలహళ్లిలో చోటుచేసుకుంది. చింతామణి తాలుకాలోని కాచనహళ్లికి చెందిన వివాహిత మహిళ అనూషా(19), ఎం.ముద్దలహళ్లి గ్రామానికి చెందిన వేణు(21) ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
గత రెండేళ్లుగావేణు, అనుషా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరు కులాలు వేరు. కోలారు పాటు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె (అన్నమయ్య జిల్లా)కు వెలుతున్న ప్రేమికులు సినిమాలు, షికార్లు తిరిగారని తెలిసింది. ప్రేమికులు వేణు, అనుషాల విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. అనుషా కంటే వేణు తక్కువ కులం వాడు కావడంతో వారి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

అనుషా బంధువులు కూడా వీరి పెళ్లిని వ్యతిరేకించారు. ఏడాది క్రితం చింతామణి సమీపంలో ఒంటరిగా వెలుతున్న వేణు మీద దాడి చేసిన అనుషా బంధువులు ఇంకోసారి ఆమె జోలికి వస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత కూడా అనుషా, వేణు నిత్యం కలుస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అనంతరం అనూషాకు ఆమె తల్లిదండ్రులు ఇదే ఏడాది మే 26వ తేదీన చింతామణి తాలూకాలోని కాచహళ్లికి చెందిన చౌడ్ రెడ్డి అనే యువకుడితో వివాహం జరిపించారు.
చౌడ్ రెడ్డి, అనుషాలు పెళ్లి చేసుకున్న తరువాత బెంగళూరు నగర శివార్లలోని డాబస్‌పేటలో కాపురం పెట్టి అక్కడే నివాసం ఉంటున్నారు. ఆషాడ మాసం సందర్బంగా అనూషా ఆమె స్వగ్రామానికి వచ్చింది.పెళ్లి తర్వాత కూడా ప్రేమికులు అనుషా, వేణు మొబైల్ ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నారు. సొంత గ్రామానికి వెళ్లిన అనుషా ఆమె మాజీ ప్రియుడు వేణును కలిసి మాట్లాడిందని తెలిసింది. ఇక కలిసి జీవించలేమని అనుకున్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.శనివారం రాత్రి గ్రామం సమీంలోని వ్యవసాయ పొలంలోని బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం మద్యాహ్నం వ్యవసాయ బావి దగ్గరకు ఆ భూమి యజమాని చలపతి వెళ్లాడు బావి గట్టు మీద మొబైల్ ఫోన్ లు, చెప్పులు, అనుషా పర్సు గుర్తించి గ్రామస్తుల సహాయంతో కెంచర్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వ్యవసాయ బావిలో అనుషా, వేణుల మృతదేహాలను ఆదివారం రాత్రి వెలికితీశారు. తరువాత అనూషా భర్త చౌడ్ రెడ్డికి సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం రాత్రి చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కెంచర్లహళ్లి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications