ప్రియుడుతో సినిమాకు వచ్చిన మహిళ... అదే సినిమాకు వచ్చిన భర్త... ఇద్దరికి దేహశుద్ది
కొన్నిసార్లు సినిమాలో చూపించినట్టు అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు అతి ఈజిగా దొరికిపోతారు. భర్తను మాయచేసిన మహిళ, భార్యను మాయ చేసే భర్తలు సైతం ఇందుకు అతీతం కాదు. ఈనేపథ్యంలోనే యువకుడి మోజులో పడిన ఓ గృహిణి మరో యువకుడితో సినిమాకు సైతం వెళ్లింది. అయితే దురదృష్టవశాత్తు ఆదే సినిమాకు భర్త సైతం వచ్చాడు. ఇద్దరి భాగోతాన్ని కళ్లారా చూశాడు. దీంతో విషయాన్ని గమనించిన భర్త సినిమా హాల్లో ఇద్దరికి దేహశుద్ది చేశాడు. దీంతో విషయం పోలీసులకు చేరడంతో విషయం బయటపడింది.
అక్రమ సంబంధం గుట్టురట్టు
అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పుదు. అది మహిళలైన, పురుషులకైన వర్తిస్తుంది. కొన్ని అక్రమ సంబంధాల సంఘటనలు విచిత్రింగా బయటపడతాయి. ఎవ్వరికైతే తమ సంబంధం గురించి తెలియకూడదని భావిస్తామో వారికే రెడ్ హ్యండెడ్ గా పట్టుపడతారు. ఇలాంటీ సంఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ప్రియుడితో సినిమా హాల్లో పట్టుపడ్డ గృహిణి
ఉత్తరప్రదేశ్ గజియాబాద్ పట్టణంలో ఓ జంట నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. అది ఇద్దరి శారీరక సంబంధాల వరకు వచ్చింది. పైగా మహిళ గర్భవతి కూడ అయింది. దీంతో ఇద్దరు కలిసి ఓ సినిమాకు వెళ్లాలని అనుకున్నారు. అందులో బాగంగానే పబ్లిక్ ఎక్కువగా రాని ఇంగ్లీష్ సినిమాకు వెళ్లారు. అయితే సగం సినిమా వరకు ఎపిసోడ్ బాగానే గడిచింది. ఇంట్రవల్లో ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మహిళకు షాక్ తగిలింది. ఎదురుగా తన భర్త ఉన్నాడు. విషయం ఎమిటంటే భర్త కూడ అదే సినిమాకు వెళ్లాడు.
అదే సినిమాకు హలు చేరిన భర్త
దీంతో మహిళ రివర్స్ గేర్ వేసింది. తన పక్కన ఉన్న యువకుడు తనకు ఎవరో తెలియదని చెప్పింది. తన స్నేహితురాలితో సినిమాకు వచ్చానని చెప్పింది. అయతే స్నేహితురాలు పని ఉందని మధ్యలోనే వెళ్లిపోయిందని అమాయకంగా కట్టు కథ అల్లింది. స్నేహితురాలు వెళ్లిన తర్వాత యువకుడు వచ్చి తనను వేధిస్తున్నాడని భర్తతో చెప్పింది. ఇది నమ్మని భర్త ఇద్దరికి దేహశుద్ది చేశాడు. దీంతో పోలీసులు రావడంతో విషయం బయటికి వచ్చింది.