ముంబైలో అగ్ని ప్రమాదం: హడలిపోయిన స్థానికులు
ముంబాయి: ముంబై నగరంలో అగ్నిప్రమాదం సంభవించింది. పలువురికి గాయాలై ప్రాణాలతో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి పరుగు తీశారు.
ముంబై నగరంలోని గోరాగాన్ ఏరియాలోని మలాద్ ప్రాంతంలో స్క్రాప్ (గుజరి) దుకాణాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం గుజరి షాప్ లలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గుజరి షాప్ ల యజమానులు, పని చేస్తున్న వారు పరుగు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది 8 వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచెయ్యడానికి ప్రయత్నించారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని ముంబాయి పోలీసు అధికారి సాంబాజీ పట్నాకర్ చెప్పారు. పేలుడు పదర్థాలు పెట్టడం వలన మంటలు వ్యాపించాయా, మరేమైనా కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications