ప్రేమ, పెళ్లి పేరుతో విద్యార్థిని మీద అత్యాచారం చేసిన మేనేజర్, గర్భవతి, తల్లిని చేసి!

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని 10వ తరగతి బాలికను నమ్మించి ఆమె మీద అత్యాచారం చేసి గర్భవతిని చేసిన సంఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, మంగళూరు సమీపంలోని కసబా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూడా ప్రాంతంలో నివాసం ఉంటున్న సుకేష్ శెట్టిగార్ (30) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మంగళూరు తాలుకా పుత్తిగే గ్రామంలో నివాసం ఉంటున్న బాలిక (16) బెళ్మణ్ణలోని ఓ ప్రైవేటు స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నది. బెళ్మణ్ణ పట్టణంలోని ఉజాలా హోటల్ లో సుకేష్ శెట్టిగార్ క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

A minor girl has been raped in Kasaba near Mangaluru in Karnataka

గత ఏడాది డిసెంబర్ నెలలో బాలిక పుట్టిన రోజు వేడుకలు ఉజాలా హోటల్ లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉజాలా హోటల్ క్యాషియర్ సుకేష్ శెట్టిగార్ బాలికకు పరిచయం అయ్యాడు. తరువాత తరచూ బాలికను కలుసుకుంటున్న సుకేష్ శెట్టిగార్ ఆమెను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.

పెళ్లి చేసుకుంటానని బాలికను సుకేష్ శెట్టిగార్ నమ్మించాడు. మూడబిద్రిలోని ఓ లాడ్జ్ కు బాలికను తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. తరువాత బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కసబా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మైనర్ మీద అత్యాచారం చేశాడని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సుకేశ్ శెట్టిగార్ ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం సుకేష్ శెట్టిగార్ ను 15 రోజులు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+