మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి ?, వీడియోలు వైరల్ తో షాక్, యోగి అడ్డాలో !

లక్నో/ఉత్తరప్రదేశ్: యువతి ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. యువతి కుటుంబ సభ్యులు ప్రతినిత్యం బయటకు వెళ్లి వస్తున్నారు. ఒక్కొసారి అమ్మాయి మాత్రమే ఉంటున్నది. అమ్మాయి ఒంటరిగా ఉంటున్న విషయం గుర్తించిన కొందరు కామాంధులు ఆమె మీద కన్ను వేశారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి వీడియోలు తీశారు. తరువాత అసలు కథ మొదలైయ్యింది.

ఉత్తరప్రదేశ్ లో నేరాలకు ఏమాత్రం కొదవలేకుండా పొతున్నదని చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత నేరస్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. గుండాలు, రౌడీషీటర్లు, అత్యాచారాలు చేస్తున్న వారిని ఎన్ కౌంటర్ లో అంతం చేస్తున్నా ఉత్తరప్రదేశ్ లో మాత్రం నేరాల సంఖ్య వెలుగు చూస్తూనే ఉంది.

A minor girl was kidnapped and gang-raped by youths in Uttar Pradesh.
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల దళిత అమ్మాయిని ఎత్తుకుని వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. జౌన్ పూర్ సమీపంలోని మచ్లీషహర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్మాయి ఇంటిలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లారు.

ఇంటిలోకి చోరబడిన కామాంధులు ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి తరువాత నిర్జనప్రదేశంలోని ఇంటిలో ఆమె మీద సామూహిక అత్యాచాం చేశారు. కామాంధులు టార్చర్ తట్టుకోలేక అమ్మాయి కేకలు వెయ్యడం మొదలుపెట్టింది. సమీపంలోని గ్రామస్తులు వస్తారని భయపడిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

ఆగస్టు 14వ తేదీన ఈ సంఘటన జరిగింది. కామాంధుల నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన దళిత బాలిక ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. అయితే తక్కువ కులం కావడం, సహాయం చేసే వాళ్లు లేకపోవడం, రాజకీయ పలుకుబడి లేకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమి చెయ్యలేక, ఎవ్వరిని ఆశ్రయించలేకపోయారు.

A minor girl was kidnapped and gang-raped by youths in Uttar Pradesh.

అమ్మాయికి ఆమె కుటుంబ సభ్యులు నచ్చ చెప్పి కుమిలిపోతూ సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఆగస్టు 15వ తేదీ సాయంత్రం నుంచి దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు ఆమె బంధువులు వీడియోలు చూసి హడలిపోయారు.

మైనర్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేస్తున్న వీడియోలు వైరల్ కావడం, ఆమె కుటుంబ సభ్యులకు పలువురు ఫోన్లు చేసి ఏమి జరుగుతోందని ప్రశ్నించడంతో వాళ్లు కుమిలిపోయారు. చివరికి ధైర్యం చేసిన బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసింది స్థానికంగా నివాసం ఉంటున్న పప్పు. ప్రమోద్, గోర్, విక్కీ, శేషామణి, అశీష్ అనే కామాంధులు అని సమాచారం తెలిసిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+