పెళ్లైన నెలకే మోడల్ ప్రియాంక ఆత్మహత్య, భర్త వల్లే!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 25 ఏళ్ల మోడల్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మోడల్ పేరు ప్రియాంక. ప్రియాంక తాను నివసిస్తున్న డిఫెన్స్ కాలనీలో ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఆమె రెండు పేజీల సూసైడ్ నోట్ రాసింది.

ప్రియాంక ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె భర్తను తప్పుబడుతున్నారు. ఆమె భర్త నితిన్ చావ్లా వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం తన కూతురు ప్రియాంకను నిత్యం భర్త వేధించేవాడని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

A Month After Marriage, Model Allegedly Commits Suicide in Delhi

ప్రియాంకకు ఇటీవలే నితిన్‌తో పెళ్లి జరిగింది. వారికి పెళ్లి జరిగి దాదాపు నెల రోజులు మాత్రమే అవుతోంది. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నితిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రియాంక ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా రన్ చేస్తోంది. ప్రియాంక శనివారం ఉదయం తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. మృతదేహం వద్ద రెండు పేజీల సూయిసైడ్‌ నోట్‌ దొరికినట్లు పోలీసులు తెలిపారు. అయితే లేఖలో ఆమె ఏం రాసిందన్న విషయాన్ని వారు బహిర్గతపరచలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+