శత్రువుతో తల్లి రాసలీలలు: కొడుకు చూశాడని కిరాయి ఇచ్చి కిడ్నాప్ చేసి చంపించింది !

అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నాడని ఆరోపిస్తూ కన్న కుమారుడిని ఓ తల్లి కిరాయి ఇచ్చి దారుణంగా హత్య చేయించింది. తల్లి ప్రియుడే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడని కర్ణాటకలోని శివమొగ్గ జిల

బెంగళూరు: అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నాడని ఆరోపిస్తూ కన్న కుమారుడిని ఓ తల్లి కిరాయి ఇచ్చి దారుణంగా హత్య చేయించింది. తల్లి ప్రియుడే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పోలీసులు చెప్పారు.

శివమొగ్గ జిల్లా శికారీపుర తాలుకా కల్మనె గ్రామంలో నివాసం ఉంటున్న ప్రమోద్ (7) తల్లి కామక్రీడకు అడ్డుపడుతున్నాడని చంపేశారని పోలీసులు అన్నారు. ప్రమోద్ తల్లి రేఖ, ఆమె ప్రియుడు తిమ్మేగౌడను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శివమొగ్గ జిల్లా కుంసీ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు.

కొడుకు అడ్డుపడుతున్నాడు !

కొడుకు అడ్డుపడుతున్నాడు !

శివమొగ్గ జిల్లాలోని కల్మనె గ్రామంలో వీరభదద్రప్ప, రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ప్రమోద్ చూరడియలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. రేఖ అదే గ్రామంలో నివాసం ఉంటున్న తిమ్మేగౌడతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

శత్రువుతో రాసలీలలు

శత్రువుతో రాసలీలలు

ప్రమోద్ తండ్రి వీరభద్రప్ప, తిమ్మేగౌడకు పాతకక్షలు ఉన్నాయి. భర్త శత్రువు తిమ్మేగౌడతోనే రేఖ అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరభద్పప్ప ఇంటిలో లేని సమయంలో తిమ్మేగౌడ వచ్చి రేఖతో రాసలీలలు జరుపుతున్నాడు. ఈ విషయం ప్రమోద్ కంటపడింది.

తండ్రికి చెప్పాడు, బెండ్ తీశాడు !

తండ్రికి చెప్పాడు, బెండ్ తీశాడు !

మీరు ఇంటిలో లేని సమయంలో తిమ్మేగౌడ వచ్చి వెలుతున్నాడని ప్రమోద్ అతని తండ్రి వీరభద్రప్పకు చెప్పాడు. పద్దతి మార్చుకోవాలని, శుత్రువును ఎందుకు ఇంటికి పిలుస్తున్నావని మండిపడిన వీరభద్రప్ప భార్య రేఖను చితకబాదాడు.

కొడుకు హత్యకు కిరాయి !

కొడుకు హత్యకు కిరాయి !

మన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న తన కొడుకు ప్రమోద్ ను చంపేయాలని రేఖ ప్రియుడు తిమ్మేగౌడకు చెప్పింది. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తల నుజ్జునుజ్జు చెయ్యాలని సూచించి కిరాయి ఇచ్చింది. జూన్ రెండో తేదీన స్కూల్ దగ్గర ఉన్న ప్రమోద్ ను బైక్ లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

దారుణంగా చంపేశారు !

దారుణంగా చంపేశారు !

ప్రమోద్ తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసి మృతదేహాన్నికుమద్వతి నదిలో విసిరివేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని బైక్ లో కిడ్నాప్ చేశారని తెలుసుకున్న పోలీసులు చుట్టు పక్కల గ్రామాల్లోని బైక్ లను పరిశీలించారు.

కిడ్నాప్ చేసిన సమయంలో !

కిడ్నాప్ చేసిన సమయంలో !

ప్రమోద్ ను కిడ్నాప్ చేసిన సమయంలో స్థానికులు ఇచ్చిన క్లూ ఆధారంగా తిమ్మేగౌడను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రమోద్ ను తానే కిడ్నాప్ చేసి హత్య చేసి మృతదేహాన్ని కుమద్వతి నదిలో విసిరివేశానని తిమ్మేగౌడ అంగీకరించాడు.

నేరం అంగీకరించిన కసాయి తల్లి !

నేరం అంగీకరించిన కసాయి తల్లి !

తన కుమారుడిని హత్య చెయ్యడానికి కిరాయి ఇచ్చానని ప్రమోద్ తల్లి రేఖ అంగీకరించిందని పోలీసులు చెప్పారు. ప్రమోద్ మృతదేహానికి వైద్యపరీక్షలు నిర్వహించి అతడి తండ్రి వీరభద్రప్పకు అప్పగించామని పోలీసులు చెప్పారు. రేఖ, అమె ప్రియుడు తిమ్మేగౌడను పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+