తుపాకి చూపించి నడిరోడ్డులో లేడీ టీచర్ తో ?, తండ్రి ఉన్నాడు కాబట్టి, ఏం జరిగింది ?
అమ్మాయిల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కర్ణాటక, ఢిల్లీతో సహా దేశంలోని పలు చోట్ల పిచ్చి ప్రేమికుల వరుస హత్యలు చేస్తున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇప్పుడు రోడ్డుపై వెళుతున్న లేడీ టీచర్‌ని అడ్డగించిన పిచ్చి ప్రేమికుడు ఆమెను పిస్టల్ తో బెదిరించాడు. అనంతరం నుదిటిపై కుంకుమ పెట్టి నడిరోడ్డుపై ఆమెను పెళ్లి చేసుకుందామని హంగామా చేశాడు.
అయితే లేడీ టీచర్ తండ్రి కృషి, పట్టుదలతో వన్ సైడ్ లవర్ ను ధైర్యంగా ఎదిరించడంతో ఆ ప్రమాదం నుంచి తండ్రి, కూతురు తప్పించుకున్నారు. ఈ ఘటనను వీడియో రికార్డు కూడా అయ్యింది.

ఈ ఘటన బీహార్‌లోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన అనంతరం ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఆ పిచ్చి ప్రేమికుడి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అమర్‌పూర్‌లోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న యువతి ప్రతిరోజు ఆమె తండ్రితో కలిసి స్కూల్ దగ్గరకు వెళ్లడం, సాయంత్రం స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్లడం చేస్తోంది. తన తండ్రితో కలిసి ఆ యువతి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సాయంత్రం స్కూల్ లో క్లాస్ ముగించుకున్న లేడీ టీచర్ ఆమె తండ్రితో కలిసి స్కూటర్ లో ఇంటికి తిరిగొచ్చింది. తండ్రి సమీపంలో స్కూటర్ పార్క్ చేసిన తరువాత నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మెల్లగా చినుకులు కురుస్తున్న రోడ్డుపై తండ్రితో కలిసి టీచర్ నడుచుకుంటూ వెళ్తున్నది. ఆసమయంలో పిచ్చి ప్రేమికుడు ముఖానికి గుడ్డ కట్టుకుని వచ్చారు. టీచర్ దగ్గరకు వెళ్లిన వెంటనే తుపాకీ తీశాడు. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని లేడీ టీచర్ ను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తుపాకీతో బెదిరించాడు. ఆ సమయంలో యువతి తండ్రి అక్కడికి పరుగు తీశాడు. తన కూతురిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అతన్ని నిలదీశాడు.
నేను నీ కూతురిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ ప్రేమికుడు నానా హంగామా చేశాడు. అయితే తాను ఇతన్ని పెళ్లి చేసుకోనని ఆమె తేల్చి చెప్పింది. తరువాత లేడీ టీచర్ తండ్రి ధైర్యంగా ఆ యువకుడితో గొడవపడి తుపాకి కిందకు లాగేసి అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వన్ సైడ్ లవర్ కోసం గాలిస్తున్నారు. తనను వన్ సైడ్ లవర్ ఇబ్బంది పెడుతున్నాడని రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు పట్టించుకోలేదని యువతి ఆరోపిస్తున్నది. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications