నిప్పుతో చెలగాటం: జుట్టుకు మంటపెడుతున్న హెయిర్ స్టయిలిస్ట్!
హెయిర్ కట్ లో భాగంగా జుట్టుకు మంట పెట్టడం ఈ పాకిస్తానీ హెయిర్ స్టయిలిస్ట్ అనుసరించే స్టయిల్. అయినా జుట్టు ఏమాత్రం కాలకపోవడం ఆశ్చర్యం.
ఇస్లామాబాద్: ఈ రోజుల్లో వింత వింత హెయిర్ స్టయిల్స్ ఎన్నో చూస్తున్నాం. కాస్త జుట్టున్న ప్రతి వారూ ఓ డిఫరెంట్ స్టయిల్ తో కనిపించడానికి తాపత్రయ పడుతుంటారు.
అందుకు తగినట్లే హెయిర్ స్టయిలిస్ట్ లు కూడా పుట్టుకొస్తున్నారు. అయితే వీళ్ళెవరూ ఈ పాకిస్తానీ హెయిర్ స్టయిలిస్ట్ కు సాటిరారేమో. ఇతడు ఏకంగా జుట్టుకే మంట పెట్టేస్తున్నాడు.
నిజం.. హెయిర్ కట్ లో భాగంగా జుట్టుకు మంట పెట్టడం ఇతడి స్టయిల్. ఒమర్ ఖురేషీ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ వెరైటీ హెయిర్ కట్ కు సంబంధించిన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు.

కటింగ్ కు వచ్చిన వారి తలపై ఆ హెయిర్ స్టయిలిస్ట్ ముందు ఏదో పౌడర్ చల్లి, దానిపై కాస్త ఆయిల్ వేసి లైటర్ తో జుట్టుకు మంట పెడతాడు. ఆ తర్వాత వేగంగా రెండు చేతులతో దువ్వుతూ ఆ మంటలను ఆర్పేస్తాడు.
విచిత్రం ఏమిటంటే... ఇలా రెండుసార్లు చేసినా జుట్టు ఏమాత్రం కాలకపోవడం. మామూలుగా మంట సెగ తగిలితేనే వెంట్రుకలు చుర చుర మంటూ కాలిపోతాయి, అలాంటిది తలపై నిమిషానికి పైగానే మంట మండినా జుట్టు ఏమాత్రం కాలకపోవడం విశేషమే.
ఈ హెయిర్ స్టయిల్ ప్రత్యేకత ఏమిటో చేసే అతనికి, చేయించుకునే వాళ్ళకే తెలియాలి. అయితే ఈ మేకింగ్ వీడియో మాత్రం ట్విటర్ లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఇది చూసి ఒకింత షాక్ తిన్నారు కూడా. ఇంటర్నెట్ లో మీరూ చూడండి మరి.












Click it and Unblock the Notifications