Himachal Pradesh: లక్ష రూపాయల బండి కోసం.. కోటీ రూపాయల నెంబర్..

ఓ వ్యక్తి స్కూటీకి ఫ్యాన్సీ నెంబర్ కోసం కోటీ రూపాయల బిడ్ దాఖలు చేశారు.

ఓ వ్యక్తి లక్ష రూపాయల బండికి కోటి రూపాయలు పెట్టి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలోని రిజిస్టరింగ్, లైసెన్సింగ్ అథారిటీ కోట్‌ఖాయ్‌లో ఫ్యాన్సీ నంబర్ (HP-99-9999) కోసం ఓ వ్యక్తి రూ. 1.12 కోట్లకు పైగా ఆన్‌లైన్ బిడ్ దాఖలు చేశాడు. మొదటిసారిగా ఇంత మొత్తం ఫ్యాన్సీ కోసం కోట్ చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

1.12 కోట్లకు పైగా

1.12 కోట్లకు పైగా

అధికారులు బిడ్డర్ ధ్రువపత్రాలను పరిశీలిస్తుండగా 1.12 కోట్లకు పైగా ఆన్‌లైన్ బిడ్ చూసిన అధికారులు షాకయ్యారు. ఆ తర్వాత నంబర్‌ను కేటాయించారు. ఫ్యాన్సీ నంబర్ (HP-99-9999) కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్ శుక్రవారం సాయంత్రం ఓపెన్ చేశారు. ఈ నెంబర్ రూ.1000 రిజర్వ్ ధర నిర్ణయించగా.. బిడ్డింగ్ లో 26 మంది పాల్గొన్నారు. అందులో ఓ వ్యక్తి రూ. 1,12,15,500 కోట్ చేశారు.
ఆదిత్య నేగి

ఆదిత్య నేగి

ఈ నెంబర్‌కు చివరిసారిగా ఉనా జిల్లా నుంచి అత్యధిక ధర పలికిందని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి చెప్పారు. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ నంబర్‌ను ఏ వాహనం కోసం ఉపయోగిస్తారనేది స్పష్టమవుతుందని చెప్పారు. "ఈ నెంబర్‌ను ద్విచక్ర వాహనం కోసం కొనుగోలు చేస్తున్నారా లేదా నాలుగు చక్రాల వాహనం కోసం కొనుగోలు చేస్తున్నారా అనేది ఇప్పటివరకు తెలియదు" అని ఆయన తెలిపారు.

కోట్‌ఖాయ్

కోట్‌ఖాయ్

ఈ నంబర్‌ కోసం కోట్ చేసిన వ్యక్తి కోట్‌ఖాయ్ ప్రాంతంలో నివాసి అయి ఉండాల్సిన అవసరం ఉందన్నారు."విజయవంతమైన బిడ్డర్ స్థానిక నివాస రుజువును చూపించవలసి ఉంటుంది, ఎందుకంటే బిడ్డర్ దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఉండవచ్చు, కానీ అతను లేదా ఆమె వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆ ప్రాంతంలో నివసించాలి" అని చెప్పారు. బిడ్డర్ వివరాలను తనిఖీ చేయమని తాను SDM కోట్‌ఖాయ్‌ని కోరినట్లు ఆదిత్య నేగి చెప్పారు.

మిగతా నెంబర్లకు కూడా..

మిగతా నెంబర్లకు కూడా..

ఇదే నెంబర్ కాకుండా మిగతా నెంబర్లకు వేలం నిర్వహించారు. రూ. 1000 రిజర్వ్ ధర గల ఫ్యాన్సీ నెంబర్ (HP-99-0009) వేలం ప్రక్రియలో మొత్తం 10 మంది దరఖాస్తుదారులప పాల్గొనగా.. అత్యధికంగా రూ. 21,67,500 కోట్ చేశారు. రూ. 1000 రిజర్వ్ ధర కలిగిన మరె ఫ్యాన్సీ నెంబర్ (HP-99-0005) వేలం ప్రక్రియలో మొత్తం 5 మంది పాల్గొనగా.. అత్యధికంగా రూ. 20,10,000 కోట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+