Cyber Crime: లైక్ కొడితే డబ్బులిస్తామని చెప్పి.. రూ. 8 లక్షలు కాజేశారు..

ఈ మధ్య సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తికి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. ఉద్యోగంలో భాగంగా యూట్యూబ్ వీడియోలను లైక్ చేయాలని, అలా చేస్తే డబ్బులిస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. రెండు రోజుల తర్వాత వీడియోలకు లైక్ లు కొడితే రోజుకు రూ.3వేల నుంచి రూ.6వేల ఇస్తామని ఓ మహిళ మే మొదటి వారంలో ఫోన్ చేసింది. దీంతో సదరు వ్యక్తి యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొట్టాడు.

మొదట కొన్ని వీడియోలకు లైక్ లు కొట్టినందకు కొంత డబ్బు అతని ఖాతాలో జమ అయింది. ఇలా కొద్ది రోజులు జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బాధితుడిని టెలిగ్రామ్‌లోని కొన్ని గ్రూపులలో చేర్చారు. ఇక నుంచి డబ్బు అతని 'వర్చువల్ ఖాతా'లో జమ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత డబ్బు పెట్టబడి పెడితే డబుల్ అవుతందని చెప్పారు. ఇలా బాధితుడు మొత్తం రూ. 8.59 లక్షలను కోల్పోయాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

A person was cheated by cyber criminals and robbed of Rs.8.59 lakhs

ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కవగా జరుగుతున్నాయి. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. అయితే ఆమె ఫోన్ కు ఒక రోజు ఒక మేసేజ్ వచ్చింది. సందేశంలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ వేలల్లో డబ్బులు పొందవచ్చని ఉంది. పూర్తి సమాచారం కోసం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఓ ఫోన్‌ నెంబరును ఇచ్చారు. ఆమె ఆ నెంబరుకు ఫోన్‌ చేశారు. అవతలి వారు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే చాలని, అన్నింటికి లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.

ఆమె మూడు వీడియోలు లైక్‌ చేసింది. దీంతో వెంటనే ఆమె బ్యాంక్ అకౌంట్ లో రూ.150 క్రెడిట్ చేశారు. మరోసటి రోజు మరో ఆరు వీడియోలను లైక్‌ చేయగా.. రూ. 300 పంపారు. ఇలా నమ్మం కుదిరిన తర్వాత పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మబాలికారు. ఇదంతా నమ్మిన ఆమె తొలుత రూ.1000 చెల్లిస్తేం రూ.1,600 ఆమె ఖాతాలో జమ చేశారు. దీంతో ఆమె మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇలా విడతలవారీగా ఏకంగా రూ.19 లక్షలు మోసగాళ్లకు బదిలీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+