లిప్ట్‌లో బాలికపై దాడిచేసిన పెంపుడు కుక్క.. వైరల్ వీడియో..!
ప్రస్తుతం ఎక్కడచూసినా చాలామంది పిల్లలు కుక్క కాట్లకు గురవుతున్నారు. కుక్కలు ఎక్కడాపడితే అక్కడ పిల్లలపై విరుచుకపడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని సెక్టార్-107లోని లోటస్ సొసైటీలోని లిప్ట్‌లో ఓ బాలికపై పెంపుడు కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన లోటస్ 300 సొసైటీలో ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సొసైటీలోని టవర్ 2లోని లిప్ట్‌లో రాత్రి 9 గంటల సమయంలో ఓ బాలిక కింద నుంచి వస్తోంది. ఆ లిప్ట్ కాస్త రెండో అంతస్తులో ఓపెన్ అయ్యింది. డోర్ తెరవగానే ఒక్కసారిగా కుక్క లోపలికి వచ్చి ఆ బాలికపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక, ఈ వీడియోలో ఏముందంటే.. ఓ బాలిక లిప్ట్‌లో కిందనుంచి పైకి వెళ్తున్న సమయంలో లిఫ్ట్ రెండో ఫ్లోర్‌లో ఆగుతుంది. వెంటనే ఓ పెంపుడు కుక్క లిప్ట్‌లోకి రావడం మనం చూస్తాం. అప్పటికే లిప్ట్‌లో ఉన్న ఆ బాలికపై పెంపుడు కుక్క దాడి చేసి గాయపరుస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి కుక్కను తరిమి కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ బాలిక భయంతో వెళ్లిపోవడం మనం చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సోసైటీలో డాగ్ పాలసీ...
ఈ పెంపుడు కుక్క ఎలాంటి భద్రత లేకుండా లాబీలో తిరుగుతుందని, లిప్ట్ డోర్ తెరవగానే లోపలికి ప్రవేశించి దాడి చేస్తుందని బాధిత బాలిక కుటుంబీకులు చెబుతున్నారు. ఈ పెంపుడు కుక్క ఇంతకుముందు టవర్ 2లోని ఫ్లాట్ నంబర్ 201లో ఉన్న ఓ మహిళను కూడా గాయపరిచిందని బాధిత బాలిక కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నోయిడాలో డాగ్ పాలసీ అమల్లో ఉన్నప్పటికీ, పెంపుడు కుక్కల దాడులు తగ్గడం లేదని, ఎవరూ వాటిని పట్టించుకోవటం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సొసైటీ లేదా పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం కొసమెరుపు.
Dog attack a teenager in Noida sector-107 society . #Noida #dogattack pic.twitter.com/Il594emIv1
— Jyoti Karki (@Jyoti_karki_) May 7, 2024












Click it and Unblock the Notifications