మొగుడితో ఢిష్యూం ఢిష్యూం, అర్దరాత్రి ఏంజరిగిందంటే ?, వెంటాడిన పెంపుడు కుక్క

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించారు. భర్తకు వచ్చిన ఆస్తిలో భాగంగా సొంత ఇంటిని నిర్మించుకున్న దంపతులు సంతోషంగా ఉన్నారు. అయితే రానురాను దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. బంధువులు, చుట్టుపక్కల వాళ్ల దంపతులకు సర్ది చెబుతూ వారిని రాజీ చేస్తూ వస్తున్నారు. అయితే గొడవ తారాస్థాయికి చేరడంతో భార్య ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిపోయింది.

భర్తతో గొడవపడి ఇల్లు వదిలి నదిలో దూకి ప్రాణాలు వదలడానికి ప్రయత్నించిన ఓ మహిళను వాళ్ల పెంపుడు కుక్క రక్షించిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన ఓ రాధా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో రాధాను ఆమెను వెంబడించిన పెంపుడు కుక్క ఆమె చీరపట్టుకుని ఆమె ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకుంది.

A pet dog saved a married woman who tried to commit suicide after a fight with her husband

ఇది గమనించిన స్థానికుడు నదిలో దూకబోయిన మహిళను చాకచక్యంగా కాపాడాడు. పోలీసుల కథనం ప్రకారం ఉప్పినంగడి సమీపంలోని పిలిగోడు సమీపంలో నివాసం ఉంటూ వృత్తిరీత్యా మెకానిక్‌గా పని చేస్తున్న సూరజ్ అనే వ్యక్తి 16 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన రాధా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సూరజ్, రాధా దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తకు వచ్చిన పిత్రార్జిత ఆస్తిలో చిన్న ఇల్లు కట్టుకున్న సూరజ్, రాధా దంపతులు వారి పిల్లలతో కలిసి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు.

కొంతకాలంగా సూరజ్, రాధా దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే జూన్ 27వ తేదీ గురువారం భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో విసిగిపోయిన భార్య రాధా అర్దరాత్రి వర్షంలో తడుస్తూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రావతి నది వంతెనపైకి వెళ్లింది ఆ సమయంలో రాధా నేత్రావతి నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. అయితే రాధాతో పాటు ఆమె వెంట వచ్చిన పెంపుడు కుక్క ఆమె చీరపట్టుకుని ఆమె నదిలో దూకకుండా అడ్డుకుంది.

పెంపుడు కుక్కను వదిలించుకుని నదిలో దూకడానికి రాధా అనేక ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో బైక్ లో అటువైపు వెలుతున్న సిరాజ్ అనే వ్యక్తి విషయం గుర్తించి వెంటనే సమాజ సేవకుడు ఫయాజ్ కు సమాచారం ఇచ్చాడు. తరవాత పెంపుడు కుక్క తనదైన భాషలో అరుస్తూ ఇంటి యజమాని రాధాను ఓదార్చేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన ఫయాజ్ నదిలో దూకేందుకు సిద్ధంగా ఉన్న రాధను రక్షించి పోలీసులకు అప్పగించారు.

పోలీసులు శుక్రవారం సూరజ్, రాధ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే భర్తతో వెళ్లేందుకు అంగీకరించని రాధ బెంగళూరులోని పుట్టింటికి వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. పిల్లలు మాత్రం తండ్రితో ఉంటారని చెప్పారు. అయితే ఆ మహిళ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. మహిళ ప్రాణాలను కాపాడిన కుక్క దృఢ సంకల్పం, మహిళను రక్షించిన వ్యక్తి సమయస్ఫూర్తి పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం రాధా బెంగళూరులోని ఆమె పుట్టింటికి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+