తల్లి,కూతురు స్నానం చేస్తుంటే వీడియో తీసి లైంగిక వేధింపులు

వివాహితను, ఆమె కూతురును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అరెస్టైన ఓ కానిస్టేబుల్ మూడో అంతస్థు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

బెంగుళూరు: వివాహితను, ఆమె కూతురును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అరెస్టైన ఓ కానిస్టేబుల్ మూడో అంతస్థు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని రేవునగరి మంగళూరు సమీప బజ్పే పోలీస్స్టేషన్ లో పనిచేసే ప్రవీణ్ కుమార్ అనే కానిస్టేబుల్ శనివారం నాడు మంగళూరు కోర్టు మూడో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.

తాను నివసం ఉండే ఇంటికి సమీపంలో పైకప్పు లేని స్నానాల గదిలో వేర్వేరు సమయాల్లో స్నానం చేస్తున్న తల్లి, కూతురు వీడియోలను తీసి వారిని లైంగికంగా వేధించాడు ప్రవీణ్ కుమార్.

a police constable suicide in karnataka state

తల్లి, కూతురుకు ప్రవీణ్ కుమార్ నుండి వేధింపులు తీవ్రం కావడంతో వీరిద్దరూ తమ విషయాలను ఒకరికొకరు పంచుకొన్నారు.దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. శనివారం నాడు మంగుళూరు న్యాయస్థానంలో హజరుపర్చారు.తిరిగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా మంగళూరు న్యాయస్థానం మూడో అంతస్థు నుండి కిందకు దూకాడు ప్రవీణ్ కుమార్.

ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.ఆయనను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+