Rajasthan: రాజస్థాన్‍లో దారుణం.. దళితుడితో ఎమ్మెల్యే బూట్లు నాకించిన పోలీస్ అధికారి..!

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా రాజస్థాన్ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పోలీసు అధికారి దళిత వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేయడమే కాకుండా.. బాధిత వ్యక్తితో కాంగ్రెస్ ఎమ్మెల్యే బూట్లు నాకించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూన్ 30న జరిగినప్పటికీ బాధితుడు భయపడి విషయం బయటకు చెప్పలేదు. తాజాగా బాధితుడు పోలీసులకు జులై 27న ఫిర్యాదు చేసింది.

జూన్ 30 న తాను పొలంలో పని చేస్తున్నప్పుడు, కొంతమంది పోలీసు అధికారులు, తన కుటుంబ సభ్యులు తనను కొట్టి ఒక గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు చెప్పాడు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) శివకుమార్ భరద్వాజ్ తనపై శారీరకంగా దాడి చేసి మూత్ర విసర్జన చేశాడు. ఆ పోలీసు అధికారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా పేరును చెప్పి బెదిరించాడని పేర్కొన్నాడు. ఎమ్మెల్యే తన బూట్లు నొక్కమని బలవంతం చేశారని ఆ వ్యక్తి తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

A police officer licked MLAs shoes with a Dalit in Rajasthan

శాసనసభ్యుడు, పోలీసు తన మొబైల్ ఫోన్ లాక్కొని, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. మొదట్లో ఫిర్యాదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని, ఆ తర్వాత సీనియర్‌ అధికారులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే గోపాల్ మీనా, డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ పేర్లను నిందితులుగా చేర్చారు.

ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనకు నిత్యం బెదిరింపులు వస్తున్నాయని బాధితుడు చెప్పాడు. ఈ విషయం ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID) చేత దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దళితుడిపై దాడి చేయడం, మూత్ర విసర్జన చేయడం ఇదే మొదటిసారి కాదు.

జులైలో, మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న పాత వీడియో వైరల్‌గా మారింది. ప్రవేశ్ శుక్లా అనే నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత, ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ప్రవేశ్ శుక్లా పార్టీతో తన అనుబంధాన్ని ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+