మాజీ ప్రధానితో నరేంద్ర మోడీ డ్యాన్స్ అదుర్స్

భారత ప్రధాని నరేంద్ర మోడీలో మంచి డ్యాన్సర్ ఉన్నారని వెలుగు చూసింది. హోలీ పండుగ సందర్బంగా మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారి వాజ్ పేయితో కలసి నరేంద్ర మోడీ డ్యాన్స్ చేస్తున్న వీడియో .

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీలో మంచి డ్యాన్సర్ ఉన్నారని వెలుగు చూసింది. మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారి వాజ్ పేయితో కలసి నరేంద్ర మోడీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హోలి పండుగ సందర్బంగా వాజ్ పేయి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేసుకున్న సమయంలో నరేంద్ర మోడీ స్టేప్ లు వేసి సందడి చేశారు. ప్రఖ్యాత హిందీ పాట రంగ్ బర్సే కు వాజ్ పేయి హుషారుగా డాన్స్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది.

A rare video of Narendra Modi dancing with Atal Bihari Vajpayee

కార్యకర్తలతో కలసి డాన్స్ చేసిన వాజ్ పేయి తరువాత కాసేపు నరేంద్ర మోడీ చేయిపట్టుకుని చిందులు వేశారు. ఈ వీడియోలో ఇప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఉన్నారు. అయితే వాజ్ పేయి, నరేంద్ర మోడీ కలిసి ఏ సంవవత్సరంలో హోలీ పండగ జరుపుకున్నారు ? అనే విషయం మాత్రం కచ్చితంగా తెలియడం లేదు.

అప్పట్లో వాజ్ పేయి ప్రధాని హోదాలో ఉండొచ్చు అని సమాచారం. అప్పటికే నరేంద్ర మోడీ బీజేపీలో ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలియలేదు. 2001లో గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ వరుసగా మూడు సార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014లో నరేంద్ర మోడీ భారత ప్రధాని అయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+