అక్రమ సంబంధం, భార్యను చంపేసి తమిళ్ సినిమా స్టోరీ చెప్పాడు. రిపోర్టుతో అనంత వాసి షాక్ !
బెంగళూరు: వివాహిత మహిళ ఆత్మహత్య కేసు ఊహించని మలుపుతిరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చెయ్యడంతో ఆత్మహత్య కేసు హత్య కేసుగా నమోదు చేశారు. పిల్లల తల్లి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇటీవల బెంగళూరులోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ ఆత్మహత్య కేసు ఊహించని మలుపుతిరిగింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి మృతురాలి భర్తను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని : పావగడకు చెందిన అనురాధ (31) అనే మహిళ హత్యకు గురైయ్యింది. అనురాధ హత్య కేసులో ఆమె రెండో భర్త భర్త రాజశేఖర్ (35)ని అరెస్ట్ చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు రాజశేఖర్ బెంగళూరు చేరుకుని మేస్త్రీ పని చేస్తున్నాడు. అపార్ట్ మెంట్ లో పని చేసే అనూరాధకు గతంలో వివాహం అయ్యింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందగా ఇద్దరు పిల్లలతో కలిసి అనురాధ నివాసం ఉంటున్నది.
మూడేళ్ల క్రితం అనురాధ, రాజశేఖర్‌లు ఒకరికొకరు పరిచయం అయ్యారు. తరువాత అనురాధతో కొంతకాలం అక్రమ సంబంధం పెట్టుకున్న రాజశేఖర్ చివరికి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనురాధను వివాహం చేసుకున్న తరువాత మొదట్లో ఆమెతో రాజశేఖర్ చాలా సంతోషంగానే ఉండేవాడు. అనురాధతో పాటు ఆమె మొదటి భర్త ఇద్దరు పిల్లలను కూడా రాజశేఖర్ చాలా బాగా చూసుకునేవాడని తెలిసింది.
గత ఏడాది రాజశేఖర్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించి ఆమెతో ఎక్కువగా ఉండటం మొదలుపెట్టాడు. రానురాను అనురాధ ఉంటున్న ఇంటికి కూడా రాజశేఖర్ సరిగ్గా వెళ్లడం మానేశాడు. ఈ విషయమై రాజశేఖర్, అనురాధ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆగస్టు 29వ తేదీన ఇదే విషయమై అనురాధ, రాజశేఖర్ దంపతుల మధ్య గొడవ జరిగింది. అదే రోజు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.

ఆ సమయంలో సహనం కోల్పోయిన రాజశేఖర్ ఆవేశంతో ఊగిపోయి అతని భార్య అనూరాధను వేల్ తో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తన భార్య అనురాధ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పరప్పన అగ్రహార పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు.
అనురాధ ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్టులో అనురాధ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను గొంతు నులిమి చంపేశారని, ఆమెను హత్యకు గురైయ్యిందని పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అనురాధ రెండో భర్త రాజశేఖరపై పోలీసులకు అనుమానం వచ్చి అతడి మీద నిఘా వేసి చివరికి అతన్ని విచారించారు. తన భార్య అనురాధను తానే హత్య చేసినట్లు రాజశేఖర్ ఒప్పుకున్నాడని, హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని శుక్రవారం బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications