మద్యం మత్తులో రష్యా దౌత్యవేత్త వీరంగం (వీడియో)
న్యూఢిల్లీ: పీకలదాక మద్యం సేవించిన రష్యా దౌత్యవేత్త మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అర్ధరాత్రి అతను చేసిన రాద్దాంతంతో బైక్ లో వెళుతున్న ఇద్దరికి తీవ్రగాయాలైనాయి.
ఢిల్లీ పోలీసు మీద ఆ రష్యా దౌత్యవేత్త చెయ్యి చేసుకున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. పోలీసు అధికారుల కథనం మేరకు..... బుధవారం వేకువ జామున 1.30 గంటల సమయంలో రష్యా దౌత్యవేత్త మద్యం సేవించి కారు నడుపుతూ బయలుదేరాడు.

మార్గం మద్యలో మోతీబాగ్ ప్రాంతంలో ముందు వెళుతున్న ఓ బైక్ ను వేగంగా కారుతో డీకొన్నాడు. బైక్‌పై వెళుతున్న వారు కిందపడి గాయాలైనాయి. విషయం గుర్తించిన గస్తీ పోలీసులు కారు నిలపాలని సూచించారు.
అయితే రష్యా దౌత్యవేత్త కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లి పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను డీకొనడంతో అతనికి గాయాలైనాయి. అక్కడికి వెళ్లి ప్రశ్నించిన పోలీసు మీద రష్యా దౌత్యవేత్త చెయ్యి చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రష్యా దౌత్తవేత్త స్నేహితుడు పోలీసు అధికారులతో మాట్లాడి అయన్ను రష్యా దౌత్య కార్యాలాయానికి తీసుకు వెళ్లాడు.
రష్యా రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చామని, దౌత్యవేత్త మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో దౌత్యవేత్త ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని, గాయాలైన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications