Saree: రూ.21 లక్షల చీరను చూశారా.. ఈ డబ్బుతో పెళ్లి కూడా చెయ్యొచ్చు..!

మీరు రూ. 100 చీర నుంచి లక్ష రూపాయల చీర చూసి ఉంటారు.. మహా అంటే రూ 2 లక్షల చీర చూసి ఉంటారు.. కానీ రూ. 21 లక్షల చీర మీరు చూశారా.. లేకుంటే ఈ వార్త మీరు చదవాల్సిందే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ వస్త్ర దుకాణానికి వెళ్లే మహిళలకు అక్కడ ఉన్న రూ.21 లక్షల చీర చూసి ఆశ్చర్య పోతున్నారట. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల చీరక ధర 21 లక్షల రూపాయలు పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి చెప్పారు.

నవాబీ స్టైల్‌కు పేరుగాంచిన లక్నో ఖరీదైన చీరల సరికొత్త ట్రెండ్‌తో సందడి చేస్తోంది. ఈ చీరను హజ్రత్‌గంజ్‌లోని అడా ఫ్యాషన్ స్టోర్‌లో లభ్యమయ్యే ఈ చీర మెరిసే స్ఫటికాలతో అలంకరించబడిన షిఫాన్, చికంకారి బట్టల మిశ్రమంగా ఉంది. ఈ చీర తయారీకి రెండున్నర సంవత్సరాలు పట్టినట్లు తయారీదారులు చెబుతున్నారు. అయితే ఈ చీరను యంత్రాలు ఉపయోగించకుండా చేతితో రూపొందించామని తెలిపారు. ఈ చీరలో అత్యంత నాణ్యత ఫాబ్రిక్ ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

A saree of Rs.21 lakh stands out as a special attraction in Lucknow, Uttar Pradesh

ఈ రూ.21 లక్షల చీరను 15 రకాల కుట్లువేసి రూపొందించారని దుకాణ యజమాని చెప్పారు. ఈ చీర తయారీకి సమయం పట్టింది కాబట్టి అందుకే ఎక్కువ ధర పలుకుతున్నట్లు వివరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చీర ఖరీదు అనేక మధ్యతరగతి వివాహాల మొత్తం బడ్జెట్‌కు సమానంగా ఉంది. 21 లక్షల రూపాయలతో, కుటుంబాలు విస్తృతమైన వివాహ కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

అంతేకాకుండా ఐఫోన్‌లు, అనేక రకాల డిజైనర్ దుస్తులు, విలువైన బంగారు ఆభరణాలు, విలాసవంతమైన ఫర్నిచర్, టెలివిజన్‌లు, పాదరక్షలు, మోటార్‌సైకిళ్లు, ఉంగరాలు కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.21 లక్షలు పెట్టి చీర కొనుగోలు చేసేవారు కూడా ఉంటారు. అందుకే వీటిని తయారు చేస్తారు. అయితే చాలా తక్కువ మంది ఇంతటి ఖరిదైన చీరలు కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+