అక్రమ సంబంధం ఉందని గొడవలు, భార్యను సుత్తితో కొట్టి చంపేసిన భర్త !
బెంగళూరు/వేలూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. సొంత ఊరిలో పనులు అంతంతమాత్రం ఉండటంతో సిటీకి వెళ్లి ఏదైన ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాడు. భార్య కుమారుడితో కలిసి ఐటీ హబ్ చేరుకున్నాడు. విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్న భర్త అతని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె సుత్తితో కొట్టి చంపేశాడు.
కుటుంబ కలహాల కారణంగా భార్యపై దాడి చేసి ఆమెను హత్య చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ సెక్యూరిటీ గార్డును బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామాక్షిపాళ్య సమీపంలోని కెరెకల్లులో నివాసం ఉంటున్న చిక్కతాయి (43) అనే మహిళ హత్యకు గురి అయ్యింది. ఈ హత్యకేసులో చిక్కతాయి భర్త నాగరత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంట్లో కుటుంబ కలహాల కారణంగా గురువారం రాత్రి నాగరత్నం, చిక్కతాయి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన నాగరత్నం అతని భార్య చిక్కతాయి తలపై సుత్తితో దాడి చేసి ఆమెను చంపేసి ఇంటి నుంచి పరార్ అయ్యాడు. నిందితుడు నాగరత్నంను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన నాగరత్నం బెంగళూరులోని కామాక్షిపాళ్యంకు చేరుకుని సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి ఉంటున్న నాగరత్నం విపరీతంగా మద్యం తాగేవాడని పోలీసులు అన్నారు. నాగరత్నం రోజూ మద్యం సేవించి ఇంట్లో అతని భార్యతో గొడవ చేసేవాడని పోలీసులు అన్నారు.
భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నాగరత్నంకు అనుమానం ఉందని, ఇదే విషయమై దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగాయని పోలీసులు అన్నారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చిన నాగరత్నం మద్యం మత్తులో అతని భార్య చిక్కతాయితో గొడవ పడ్డాడు. మాటామాట పెరిగిపోవడంతో చిక్కతాయిని ఆమె భర్త నాగరత్నం హత్య చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications