ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !
న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా రిపోర్టులు తమ సంస్థ యాజమాన్యానికి అదే సంస్థ సీనియర్ ఎడిటర్ తమ మీద లైంగిక వేధింపులు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. TV9 చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక ఆరోపణలు రావడంతో మీడియాలో రంగం ఉలిక్కిపడింది.

TV 9 భారత్ వర్ష సంస్థ
TV 9 భారత్ వర్ష చానల్ సంస్థలో పని చేస్తున్న చోట ఇద్దరు సీనియర్ మహిళా రిపోర్టర్ల మీద ఆ సంస్థ సీనియర్ ఎడిటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. మహిళా ఉద్యోగులు టీవీ చానల్ యాజమాన్యానికి ఫిర్యాదు చెయ్యడంతో ఆ సంస్థ విచారణ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఎడిటర్ కు లాంగ్ లీవ్
సీనియర్ మహిళ రిపోర్టర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఎడిటర్ ను ఆ సంస్థ యాజమాన్యం లాంగ్ లీవ్ లో పంపించింది. సీనియర్ ఎడిటర్ లాంగ్ లీవ్ లో వెళ్లిన తరువాత టీవీ చానల్ విచారణ కమిటీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

రాజీనామా చేసిన ఎడిటర్ !
లైంగిక ఆరోపణలతో సంస్థ యాజమాన్యం లాంగ్ లీవ్ లో పంపించడంతో ఆ సంస్థ సీనియర్ ఎడిటర్ తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ఎడిటర్ రాజీనామాను ఆ సంస్థ యాజమాన్యం వెంటనే అంగీకరించింది. లైంగిక ఆరోపణలు చేసింది సీనియర్ మహిళా రిపోర్టర్లు కావడంతో ఆ సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని తెలిసింది.

అందుకే ఇలా చేశాం
మహిళా ఉద్యోగుల రక్షణ, వారి హక్కుల కాపాడటంలో సంస్థ ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడదని, అందుకే లైంగిక వేధింపులు వచ్చిన సీనియర్ ఎడిటర్ మీద విచారణ చేపట్టామని, ఆయన రాజీనామా చేసిన వెంటనే తాము అంగీకరించామని టీవీ చానల్ యాజమాన్యం తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications