సెలవులపై వచ్చి భార్య, కూతుర్ని చంపేసిన సైనికుడు, అక్రమ సంబంధం బిడ్దలకు నేనా తండ్రి !
ముంబాయి/నాంధేడ్: భారత ఆర్మీలో సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. మంచి అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న అతనికి ఓ కుమార్తె ఉంది. అయితే భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసి కూతురికి తల్లి అయ్యిందని, ఇప్పుడు మరో బిడ్డకు తల్లి అవుతోందని రగిలిపోయిన సైనికుడు అతని భార్యను, కూతుర్ని దారుణంగా చంపేశాడు.
సెలవులపై ఇంటికి వెళ్లిన సైనికుడు గర్భిణీ భార్యను అతని మూడు ఏళ్ల కుమార్తె హత్య చేశాడు. ఏక్‌నాథ్ జయభాయ్ అలియాస్ ఏక్ నాథ్ (34) అనే జవాన్ కు అతని భార్య తీరుపై అనుమానం వచ్చి ఆమెతో పాటు కుమార్తెను కూడా హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. జంట హత్య చేసిన అనంతరం సైనికుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

అనంతరం పోలీసులు 25 ఏళ్ల భాగ్యశ్రీ జయభాయ్, మూడు ఏళ్ల సరస్వతిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే భాగ్యశ్రీ, ఆమె కుమార్తె సరస్వతి చనిపోయారని వైద్యులు ప్రకటించారని పోలీసు అధికారులు అంటున్నారు. భాగ్యశ్రీ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అని పోలీసు అధికారులు తెలిపారు.

తాను సైన్యంలో పని చేస్తుంటే తన భార్య భాగ్యశ్రీ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కాపురం చేసి బిడ్డలకు తల్లి అయిన తన భార్య ఆ బిడ్డలకు తానే తండ్రి అని చెబుతోందని, అందుకే ఇద్దరిని చంపేశానని ఏక్ నాథ్ పోలీసుల విచారణలో అంగీకరించాడని స్థానిక మీడియా తెలిపింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఎనిమిది నెలల గర్బిణి భార్యను సైనికుడు హత్య చెయ్యడం మహారాష్ట్రలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications