దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే, మరో ఎమ్మెల్యేకి నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంట్ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న సందర్బంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు లేనిపోని తలనొప్పులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే లంచాలు తీసుంటన్న కేసులో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప అరెస్టు అయ్యారు.
ఇప్పడు మరో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మీద నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంట్ జారీ కావడంతో బీజేపీ నాయకులు హడలిపోతున్నారు. కర్ణాటకలోని మూడగెరె నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామికి ప్రత్యేక కోర్టు నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి చిక్కమగళూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

చిక్కమగళూరుకు చెందిన హూవప్పగౌడ అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామి మీద 8 చెక్ బౌన్స్ కేసులు పెట్టారు. డబ్బు అప్పుగా తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామి తరువాత తనకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని. ఆయన ఇచ్చిన చెక్ లు అన్నీ బౌన్స్ అయ్యాయని హూవప్పగౌడ కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామికి నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
ఇదిలా ఉంటే కర్ణాటకలో ఎన్నికల కోడ్ మొదలైన బుధవారం రోజు రాత్రి ఇదే బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామి ఆయన నివాసంలో చాలా మందికి చెక్ లు పంపిణి చేశారని, ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని గురువారం మరో కేసు కూడా నమోదు అయ్యింది. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు ఎంపీ, కుమారస్వామికి ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని, ఇస్తే కచ్చితంగా ఆయన్ను ఓడిస్తామని చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications