సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్, మాజీ ఎంపీ మీద మరో ఎఫ్ఐర్, దెబ్బకు ప్రజ్వల్ మైండ్ బ్లాక్

అసభ్యకర వీడియోలు రికార్డు చెయ్యంతో అవి వైరల్ చేసిన కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపుతూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కర్ణాటకలోని హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మరో లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణను బాడీ వారెంట్‌పై అప్పగించాలని సిట్‌ కోరింది. ఈ దరఖాస్తుపై బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టులో విచారణ జరగగా నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.

A special court once again handed over former MP Hasan to SIT custody in Karnataka

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాల్గవ ఎఫ్‌ఐఆర్‌ను న్యాయమూర్తి ప్రజ్వల్ రేవణ్ణకు తెలియజేశారు. మీపై మరో ఎఫ్ఐఆర్ ఉంది. మీ లాయర్ ఇక్కడ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మరో ఎఫ్‌ఐఆర్‌పై వార్తలు రావడంతో ప్రజ్వల్ ఆందోళనకు గురయ్యాడు.ఈ సమయంలో న్యాయమూర్తి ప్రజ్వల్ కేసు విచారణను కాసేపటికి వాయిదా వేశారు. మరో కేసు విచారణ అనంతరం వాదనలు వినిపిసతామని ప్రజ్వల్ తరపు న్యాయవాది అరుణ్ తెలిపారు.

ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విచారణ తిరిగి ప్రారంభం కాగానే సిట్ న్యాయవాది జగదీష్ వాదనలు వినిపించారు. ప్రజ్వల్‌కి రేవణ్ణ వాయిస్ స్యాంపిల్స్ సేకరించాలని, అతన్ని హసన్‌కు తీసుకెళ్లి విచారణ చెయ్యాల్సిన అవసరం ఉందని కోర్టుకు మనవి చేశారు.

A special court once again handed over former MP Hasan to SIT custody in Karnataka

కేసుకు సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణను విచారణ చేసి స్పాట్ లో అతని స్టేట్‌మెంట్ దాఖలు చేయాలని, దీంతో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ తరఫు న్యాయవాది జగదీష్‌ కోరారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రజ్వల్ తరపు న్యాయవాది అరుణ్ తనకు కస్టడీ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. సిట్ రోజూ కేసులు ఏదో ఒక కేసు నమోదు చేస్తోందని, ఇవి రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులని ఆయన వాదించారు.

అయితే వాదనలు విన్న తరువాత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీకి పంపిస్తున్నామని బెంగళూరులోని 42వ ఏసీఎంఎం న్యాయమూర్తి శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల అంటే జూన్ 29వ తేదీ వరకు సిట్ కస్టడీకి మాజీ ఎంపీ ప్రజ్వల్ ను అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మరో నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీలోకి తీసుకోవడంతో ఇంకా ఎన్ని వివరాలు బయటకు వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+