క్యా బాత్ హై : బహిరంగ సభలో గాలి దుమారం.. అదే స్పీడ్‌తో కాంగ్రెస్ విజయమట..!

లక్నో : సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు తెలిసినంత మరెవరికి తెలియదేమో. ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వారికి వారే సాటి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ సేమ్ ఇలాంటి సిట్యువేషన్ దర్శనమిచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సడెన్ గా గాలిదుమారం వీయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడం చర్చానీయాంశమైంది.

A storm rips the tents at the Congress rally in Saharanpur
ఎన్నికల ప్రచారంలో భాగంగా షహరన్ పూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే గాలిదుమారం వీయడంతో టెంట్లు ఎక్కడికక్కడ చిరిగిపోయాయి. దాంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది.

ఒకవైపు గాలిదుమారం వీస్తున్నా.. మైక్ అందుకున్న ఓ లీడర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ గాలి దుమారం కాంగ్రెస్ విజయానికి ముందస్తు సూచిక అంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి ఈ గాలి దుమారం నిదర్శనమన్నారు. అదలావుంటే గాలులు బాగా వేగంగా వీయడంతో రాహుల్, ప్రియాంక తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+