ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య, ఏం జరిగింది ?

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మక కళాశాలకు చెందిన కాలేజ్ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన వివేక్ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా వివేక్ ఇదే కాలేజీలో చదువుతున్నాడు, ప్రస్తుతం వినోద్ ఇంజనీరింగ్ నాలుగో సెమిస్టర్ చదువుతున్నాడు.

A student committed suicide

శనివారం కళాశాల హాస్టల్‌ గదిలో వినోద్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినోద్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలీదని పోలీసులు అంటున్నారు. కళాశాల హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ కాలేజ్ లో వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడు.

యలహంక న్యూటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అనంతరం వినోద్ మృతదేహాన్ని కిందికుదించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఏమైనా ఆధారాలు, డెత్ నోట్ ఉందా అని పోలీసులు సాక్షాలు సేకరిస్తున్నారు. ఇతర హాస్టల్ విద్యార్థులు, సిబ్బందిని సంఘటన స్థలంలోని గదిలోకి ప్రవేశించకుండా పోలీసులు నిషేధించారు.

రెండు నెలల క్రితం ఏప్రిల్ 29 వతేదీన బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో నిర్వహించిన కాలేజ్ ఫెస్టివల్ లో జరిగిన చిన్న గొడవ కారణంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది, అది ఒక విద్యార్థి హత్యలో ముగిసింది. సిలికాన్ సిటీ బెంగళూరులోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటైన ప్రముఖ కాలేజ్ లో విద్యార్థి హత్యకు గురి కావడం అప్పట్లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+