కుమార్తె పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ పాట పాడుతూ మృతి చెందిన ఎస్ఐ: మరుసటి రోజు!

తిరువనంతపురం: కుమార్తె పెళ్లి వేడుకలో ఆనందంగా ఉన్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలోని కరామణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి. విష్ణప్రసాద్ (55) కుమార్తె పెళ్లి వేడుకలో ప్రాణాలు విడిచారు.

విష్ణప్రసాద్ చిన్న కుమార్తె అర్చనా వివాహం శనివారం రాత్రి, ఆదివారం కోల్లాంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో రంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. అర్చనాను వివాహం చేసుకునే వరుడి పేరు కూడా విష్ణప్రసాద్. శనివారం రాత్రి వివాహ వేడుక సందర్బంగా ఆర్కాష్ట్రా ఏర్పాటు చేశారు

మమ్ముట్టి నటించిన అమరం చిత్రంలోని తండ్రి, కుమార్తె అనుభందాలను గుర్తు చేస్తూ పాడిన రాకిలి పూనమ్ గళ్ అనే పాటను విష్ణుప్రసాద్ స్టేజ్ మీద స్వయంగా పాడారు. విష్ణుప్రసాద్ పాటకు ఆర్కెష్ట్రా వాయిద్యాలతో పాటు సాటి బంధువుల చప్పట్లు మోగాయి.

 A sub-inspector in Thiruvananthapuram dide singing on stage on the eve of his daughter in Kerala.

ఆ సందర్బంలో పాట పాడుతున్న విష్ణుప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను కోల్లాంలోని నీందకారద ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విష్ణుప్రసాద్ మరణించాడని వైద్యులు చెప్పారు. పెళ్లి చెయ్యాలా ? వద్దా అంటు కుటంబ సభ్యులు మొదట సతమతం అయ్యారు.

అయితే ఆదివారం రాత్రి అర్చనా, ఆమె తల్లికి అసలు విషయం చెప్పలేదు. తన తండ్రి విష్ణుప్రసాద్ ఎక్కడ అంటూ అర్చనా కుటుంబ సభ్యులను నిలదీసింది. అయితే స్వల్ప అనారోగ్యానికి గురైనారని వస్తారని నమ్మించారు. తండ్రి చేయించిన నగలు ఆమెకు వేసి సోమవారం అర్చనా వివాహం జరిపించారు.

వివాహం పూర్తి అయిన తరువాత అర్చనా, ఆమె తల్లికి విష్ణుప్రసాద్ మరణించిన విషయం చెప్పారు. గుండెపోటుతో విష్ణప్రసాద్ మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అసలు విషయం మాత్రం వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని సమాచారం.

కుమార్తె పెళ్లి వేడుకలో ఆకస్మికంగా మృతి చెందిన ఎస్ఐ విష్ణుప్రసాద్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పిణరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి విష్ణుప్రసాద్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయని కోల్లాం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+