ఓ టెకీ నిర్వాకం : ఎస్కార్ట్ సైట్ లో భార్య ఫోన్ నంబర్
పుణే : భార్య భర్తలన్నాక గొడవలు రావడం.. సర్దుమణగడం కామనే. కానీ కక్షపూరితంగా వ్యవహరించిన ఓ భర్త ఏకంగా భార్య ఫోన్ నంబర్ ను ఓ ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెట్టేశాడు. దీంతో ఎవరెవరి నుంచో ఆమెకు అభ్యంతర ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. విషయాన్ని పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లగా అప్పుడు బయటపడింది అసలు విషయం.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ కు చెందిన అరుణ్ వేకర్ (35) అనే సాఫ్ట్ ఇంజనీర్ తన భార్యతో కలిసి పుణేలోని సస్ రోడ్డులో నివాసముంటున్నాడు. వీరిద్దరికి మూడేళ్ల క్రితం వివాహం కాగా, వేకర్ భార్య (33) ఇన్ఫోటెక్ పార్కులో ఉద్యోగం చేస్తోంది. గొడవలు ఎలా మొదలయ్యాయో తెలియదు గానీ తరుచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో.. భార్యపై కక్ష సాధించాలని చూసిన అరుణ్ వేకర్, ఆమె నంబర్ ను ఓ ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెట్టాడు.
దీంతో ఆమె మొబైల్ కు అపరిచితుల నుంచి అభ్యంతరకర కాల్స్ పోటెత్తాయి. విసిగిపోయిన ఆమె విషయాన్ని స్థానిక హింజెవాది పోలీసుల ద్రుష్టి తీసుకెళ్లింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా అరుణ్ వేకర్ ను విచారించడంతో అతను నిజం అంగీకరించక తప్పలేదు.












Click it and Unblock the Notifications