ఏందిదీ?: 8 సార్లు బీజేపీకి ఓటేసిన యువకుడు! వీడియో వైరల్, ఈసీపై ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు వీడియో సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో నిబంధనలకు విరుద్ధంగా ఆ యువకుడు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. ఒకసారి కాదు, ఏకంగా 8 సార్లు ఓటేశాడు. అంతేగాక, తాను బీజేపీకి ఓటు వేస్తూ వీడియోలు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలు ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తమకు కావాల్సిన అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఓటు వేయవచ్చు. అంతేగాక, పోలింగ్ బూత్‌లోకి ఫోన్‌లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతిలేదు. ఇవన్ని నిబంధనలు ఉల్లంఘించి ఆ యువకుడు 8 సార్లు ఎలా ఓటేశారంటూ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ఆ వీడియోను పంచుకున్నారు. ఉల్లంఘనపై ఈసీ ఏదైనా చర్య తీసుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు. వీడియోలో యువకుడు పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించి, అతను ఎన్నిసార్లు ఓటు వేశాడో లెక్కించేటప్పుడు బీజేపీకి ఓటు వేస్తూ కనిపించాడు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించకపోవడం సహా పోలింగ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చాయి. మే 13న జరిగిన నాల్గవ దశలో, సమాజ్‌వాదీ పార్టీ అక్రమాలకు సంబంధించిన వివిధ సంఘటనల గురించి పోస్ట్ చేసింది.
Cognizance of the circulating video has been taken. Concerned District Election Officer has been directed to take prompt and effective action. https://t.co/McuqOw6oxm
— CEO UP #IVote4Sure (@ceoup) May 19, 2024
ఒక సంఘటనలో సంభాల్ జిల్లాలో ముస్లింలు తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని, ఓట్లు వేయడానికి అనుమతించలేదని ఆరోపించారు. లేఖింపూర్ ఖేరీ జిల్లాలో సమాజ్ వాదీ పార్టీ సైకిల్ గుర్తును నొక్కిన తర్వాత కూడా వీవీప్యాట్ బీజేపీ గుర్తును చూపుతుందని కొందరు ఫిర్యాదులు చేశారు.
మరోవైపు, తాజాగా వైరల్ అయిన యువకుడి వీడియోపై దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికలు సంఘం. ఎక్కడ? ఎప్పుడు? జరిగిందనేదానిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ ఘటనను సీరియస్ తీసుకున్న ఈసీ.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications