Crime News: చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ దాష్టీకం.. సహకరించిన ఆయా.. వీడియో మాయం చేసిన యాజమాన్యం..
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై నేరాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్ లో స్కూల్ బస్సు డ్రైవర్ మూడున్నరేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 8న ఘటన
భోపాల్‌లో ఈ నెల 8న ఓ ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ చదివే చిన్నారి ఇంటికెళ్లాక.. ఆమె బ్యాగ్‌లో ఉండాల్సిన అదనపు దస్తులు మార్చేసి ఉన్నాయి. ఆ తర్వాత చిన్నారి ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.మొదటగా చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

వీడియో మాయం
పైగా ఈ ఘటనకు సంబంధించి స్కూల్ బస్సులో రికార్డు అయిన దృశ్యాలను తొలగించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాష్టీకానికి సహకరించిన మహిళా హెల్పర్‌ను కూడా అరెస్ట్ చేసి పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై భోపాల్ వాసులు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇల్లు కూల్చివేత
ఇది ఇలా నిందితుడు అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. పోలీసుల సమక్షంలో షాపురా ఏరియాలోని నిందితుడి ఇంటిని స్థానికులతోనే నేలమట్టం చేయించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications