స్కూల్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో మహిళలు, యువతులు ముఖ్యంగా చిన్నారులకు రక్షణ లేకుండా పోతున్నది. మూడు సంవత్సరాల బాలిక మీద ఒక ప్రసిద్ది చెందిన స్కూల్ లో లైంగిక దాడి జరిగింది.
అణ్యంపుణ్యం తెలియని ఆ చిన్నారి బాధను తట్టుకోలేక విలవిలలాడుతున్నది. బెంగళూరు నగరంలోని ఇందిరానగరలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందిరానగరలో ప్రసిద్ది చెందిన పాఠశాల ఉంది. ఇదే స్కూల్ లో మూడు సంవత్సరాల బాలిక బేబి సిట్టింగ్ క్లాస్ కు వెళుతున్నది.
ఇటివల బాలిక మీద లైంగికదాడి జరిగింది. నొప్పి తట్టుకోలేక బాలిక కేకలు వేస్తుంటే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. బాలిక మీద లైంగిక దాడి జరిగిందని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

స్కూల్ లో సెక్యూరిటిగార్డుగా పని చేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతనిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలిక ను బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం బాలికపై లైంగిక దాడి జరగలేదని అంటున్నది.
బాలిక కేవలం మూడు గంటలు మాత్రం స్కూల్ లో ఉందని, తరువాత బాలికను ఆమె తండ్రి ఇంటికి పిలుచుకుని వెళ్లాడని అంటున్నారు. పోలీసులు స్కూల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
42 సంవత్సరాల నుండి ఉన్న ఈ స్కూల్ లో ఈ దారుణం జరిగింది. మంగళవారం విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. కామాంధుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్కూల్ దగ్గర గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు.
కోల్ కతాకు చెందిన సెక్యూరిటి గార్డు అనేక సంవత్సరాల నుండి ఇదే స్కూల్ లో పని చేస్తున్నాడు. గతంలో మారతహళ్ళి, పిణ్యా తదితర చోట్ల ఉన్న ప్రయివేటు స్కూల్ లలో చిన్నారుల మీద అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications