బాలిక రేప్, స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టు
బెంగళూరు: స్కూల్ లో ఆడుకుంటున్న చిన్నారిని తీసుకు వెళ్లి రేప్ చేసిన కేసులో స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ వ్యవస్థాపకులు(కార్యదర్శి)లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వారిద్దరి మీద పోలీసులు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇందిరానగరలోని ప్రయివేటు స్కూల్ లో మూడు సంవత్సరాల బాలిక మీద రేప్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అదే స్కూల్ లో సెక్యూరిటిగార్డుగా పని చేస్తున్న గౌతమ్ అనే కామాంధుడిని ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
స్కూల్ లో పిల్లల రక్షణ గురించి తాము గతంలో సూచించిన నియమాలు పాటించలేదని, ఎలాంటి ముందు జాగ్రత చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు వ్యవస్థాపకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

గత సోమవారం ఇంటికి వెళ్లిన బాలిక సున్నితమైన ప్రాంతంలో నొప్పిగా ఉందని కేకలు వేయడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. బాలిక మీద లైంగిక దాడి జరిగిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ స్కూల్ లోని విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడంతో పోలీసులు విచారణ చేసి సెక్యూరిటిగార్డు గౌతమ్ ను అరెస్టు చేశారు. గౌతమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండ అతనికి ఉద్యోగం ఇచ్చారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications