Viral Video: కారు ఢీకొనడంతో మరణించిన పులి.. వైరల్ అయిన వీడియో..
అడవిలో మనం వెళ్తునప్పుడు రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి. మన ముందు ఏదైనా జంతువు కనిపిస్తే ఆగిపోతాం.. లేకుండా స్పీడ్ గా వెళ్లిపోతాం. ఇలానే
మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్-నాగ్జిరా కారిడార్‌లో శుక్రవారం కారు ఢీకొనడంతో పులి మరణించింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులిని శుక్రవారం ఉదయం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు అటవీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొహ్మారా-గోండియా రోడ్డులోని ముర్దోలి అటవీప్రాంతంలో రోడ్డు దాటుతుండగా దాదాపు రెండేళ్ల వయసున్న ఈ పులిని కారు ఢీకొట్టిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) గోండియా డివిజన్ ప్రమోద్ పంచ్‌భాయ్ తెలిపారు.
#Roadkills A tiger dies after being hit by a speeding vehicle near Navegaon Nagzira tiger reserve in Maharashtra. #roadstonowhere @mid_day @MahaForest pic.twitter.com/8oQVMsVoCV
— Ranjeet Jadhav (@ranjeetnature) August 11, 2023
దురదృష్టకర సంఘటన గురువారం రాత్రి 10:00 గంటల ప్రాంతంలో జరిగింది. చనిపోయిన పులి, NNTRలోని T-14 టైగ్రెస్ వంశానికి చెందినదిగా గుర్తించారు. అది మగ పులి అని అధికారులు తెలిపారు. గోండియా డివిజన్‌లోని గోరెగావ్ పరిధిలోని పాలవాడలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 419 పులి కారు ఢీకొట్టింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం, గోరేవాడలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్‌లో పోస్ట్‌మార్టం పరీక్ష (PM) నిర్వహించారు. ఈ సమగ్ర పరిశీలన పులి మరణానికి కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

అయితో పులిని కారు ఢీకట్టిన అనంతరం ఆగింది. అయితే ఆ కారు వెనకాలే ఉన్న మరో కారులో ఉన్నవారు.. గాయపడిన పులి అడవిలోకి వెళ్లడాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో గాయపడిన కాసేపు రోడ్డుపైనే కూలబడిపోయింది. శరీరం సహకరించపోయినా కాళ్లను ఈడ్చుకుంటూ అడవిలోకి వెళ్లింది. సమచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అడవిలోని పులిని వెతికి శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేలోపు పులి చనిపోయింది.












Click it and Unblock the Notifications