స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటా .. ఏంటో స్పెషాలిటీ?
టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటాను అక్కడ ప్రారంభించింది.
లక్నో: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటా గురించి తెలుసా? అరె.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్లు విన్నాం కాని.. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట ఏంటని ఆశ్చర్యపోతున్నారా?
నిజమే.. ఈ బ్యాంక్ కొత్తగా మొదలైంది. ఎక్కడని అడగరే? ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో. ఎందుకంటే.. ఈ మధ్య టమాటా రేటు ఆకాశానంటిన విషయం తెలిసిందే కదా. దీనికి నిరసనగా లక్నోలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు.

ప్రజల నుంచి టమాటాలను సేకరించి ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తున్నారు. ఈ వినూత్న నిరసన నే స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటాగా పిలుస్తున్నారు. ఏదో ఒక విషయంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం ప్రతిపక్షానికి మామూలే కదా.
ఇప్పడు మీ హయాంలో టమాటా ధర విపరీతంగా పెరిగిపోయి.. సామాన్యుడికి అందకుండా పోయిందని చెప్పడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అందుకే వినూత్నంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటా అంటూ సరికొత్త పద్ధతిలో నిరసన మొదలెట్టింది. అయితే ఈ కొత్త తరహా నిరసనకు లక్నో ప్రజల నుంచి కూడా భారీగానే స్పందన వచ్చిందట.












Click it and Unblock the Notifications