దేశంలో భయానకంగా ఒమిక్రాన్ వ్యాప్తి: రెండువేలకు పైగా: ఏపీ-తెలంగాణల్లో ఇలా

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 58,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఒకేసారి 60 వేలకు చేరువ కావడం కలకలం రేపుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలను దాటేసింది. ఫలితంగా- పలు రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. వీకెండ్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నాయి.

రెండువేలకు పైగా..

రెండువేలకు పైగా..

ఈ పరిణామాల మధ్య ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తృతమౌతోంది.. భయానకంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలను దాటేశాయి. మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 2,135కు చేరుకున్నాయి. ఇది అక్కడితో ఏ మాత్రం ఆగేలా కనిపించట్లేదు. రెండు రోజుల కిందట 1,700 వరకు నమోదైన ఈ కేసులు ఈ 48 గంటల్లోనే రెండు వేలను దాటేశాయంటే- ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 828 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తొలి అయిదు రాష్ట్రాల్లో..

తొలి అయిదు రాష్ట్రాల్లో..

దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అత్యథిక కేసులు వెలుగులోకి వచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని తరువాత- ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి. మహారాష్ట్ర-653, ఢిల్లీ-464, కేరళ-185, రాజస్థాన్-174, గుజరాత్-154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోనూ ఈ కేసుల సంఖ్య వందను దాటేసింది. 121 పాజిటివ్ కేసులు అక్కడ రిజిస్టర్ అయ్యాయి.

ఏపీ, తెలంగాణల్లో..

ఏపీ, తెలంగాణల్లో..

ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. తమిళనాడు తరువాతి స్థానం తెలంగాణదే. ఇక్కడ 84 పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా రికార్డయ్యాయి. ఇందులో 32 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ 12వ స్థానిలో ఉంది. ఇప్పటిదాకా 24 కేసులు ఏపీలో నమోదు కాగా..ఆరుమంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు.

మిగిలిన రాష్ట్రాల్లో..

మిగిలిన రాష్ట్రాల్లో..

మిగిలిన రాష్ట్రాల పరిస్థితి దీనికేమీ తీసిపోవట్లేదు. కర్ణాటక-77, హర్యానా-71, ఒడిశా-37, ఉత్తర ప్రదేశ్-31, పశ్చిమ బెంగాల్-29, మధ్యప్రదేశ్-9, ఉత్తరాఖండ్-8, గోవా-5, మేఘాలయా-5, చండీగఢ్-3, జమ్మూ కాశ్మీర్-3, అండమాన్ నికోబార్-2, పంజాబ్-2, హిమాచల్ ప్రదేశ్, లఢక్, మణిపూర్‌లల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. ఢిల్లీ, కర్ణాటక వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+