Tomato: టమాటాల కోసం సీసీ కెమెరాలు పెడుతున్న వ్యాపారులు..
20 రోజుల ముందు వరకు కిలో రూ.20 పలికిన టమాటా తాజాగా కిలో రూ.150 లు పలుకుతోంది. దీంతో టమాటాలు కస్ట్లీ కూరగాయగా మారిపోయింది. దీంతో వ్యాపారలు టమాటాలు జోకెటప్పుడు మొగ్గు కూడా జోకడం లేదు. పైగా తమ టమాటాలు ఎవరు ఎత్తుకెళ్లకుండా నిఘా కూడా ఏర్పాటు చేసుకున్నారు. కెమెరాలు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలోని అక్కియాలుర్ కు చెందిన కృష్ణప్ప అనే వ్యక్తి కూరగాయల విక్రయిస్తుంటాడు.
కృష్ణప్పకు మార్కెట్లో శాశ్వతమైన దుకాణం లేదు. దీంతో అతని కూరగాయలు విక్రయించే స్థలంలో సీసీ కెమెరాలు బిగించేందుకు అనువైన ప్రాంతం లేదు. దీంతో ఆయన కారగాయల పెట్టెలో కెమెరా ఉంచి టమాటాలు అమ్ముతున్నాడు. టమాటా ధరలు భారీగా పెరిగాయని.. ఒక్కోక్కటి తీసుకెళ్లిన తనకు భారీగా నష్టం వస్తుందని.. అందుకే టమాటాలు ఎవరు తీసుకెళ్లకుండా కెమెరా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.

దీంతో ఈ విషయం స్థానికంగా వైరల్ అయింది. మరోవైపు కిలో టమాటాకు లీటర్ నుంచి లీటరున్నర పెట్రోల్ కూడా వస్తుంది. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.150 గా ఉంది. అంటే రూ.150 కి లిటరున్నర పెట్రోల్ వస్తుంది. ఢిల్లీలో టమాటా రూ.120 నుంచి 130 ఉంది. అంటే లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ వస్తుంది. ముంబయిలో టమాటా రూ.110 ఉంది. అంటే లీటర్ పెట్రోల్ వస్తుంది.

టమాటా ధరలు పెరగడంపై కూడా చాలా సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. టమాటాతో పాటు పచ్చి మిర్చి, అల్లం ధరలు కూడా భారీగా పెరిగాయి. పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. చెన్నైలో పచ్చి మిర్చి కిలో రూ.100 ఉండగా.. కోల్ కతాలో రూ.350 గా ఉంది. దిగుబడి తగ్గడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications